ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: మెట్రో రైళ్లలో ఎందుకిలా? డ్యాన్స్‌లు కాదు.. ఈ అమ్మాయి ఏం చేస్తోందో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2023-06-18T16:07:55+05:30

ఢిల్లీ వాసులు మెట్రో రైళ్లను తమకు ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటున్నారు. కేవలం ప్రయాణం చేయడం మాత్రమే కాకుండా రకరకాల పనుల కోసం వినియోగించుకుంటున్నారు. చాలా మంది ఢిల్లీ మెట్రో రైళ్లలో డ్యాన్స్‌లు వేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యూస్ సంపాదించుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi) వాసులు మెట్రో రైళ్లను తమకు ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటున్నారు. కేవలం ప్రయాణం చేయడం మాత్రమే కాకుండా రకరకాల పనుల కోసం వినియోగించుకుంటున్నారు. చాలా మంది ఢిల్లీ మెట్రో (Delhi Metro)రైళ్లలో డ్యాన్స్‌లు వేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యూస్ సంపాదించుకుంటున్నారు. ప్రేమ జంటలు తమ రొమాన్స్‌కు అడ్డాగా మెట్రోలను వాడుకుంటున్నాయి. తాజాగా ఓ యువతి చేసిన పని మరింత షాకింగ్‌గా ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ మహిళ మెట్రో రైలు లోపల తన జుట్టును స్ట్రెయిట్ చేస్తూ కనిపించింది. @HasnaZarooriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. మెట్రో రైలులో . ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను ఛార్జ్ చేయడానికి అమర్చిన ఛార్జింగ్ సాకెట్లలో హెయిర్ స్ట్రైయిటనింగ్ మిషన్‌ను ప్లగ్ చేసింది. అనంతరం అక్కడే తన జట్టును స్ట్రెయిటనింగ్ చేసుకుంది (Woman straightening her hair inside Delhi metro). చుట్టూ ఉన్న వారు ఆమెను అశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఎవరో ఆ మహిళ చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Viral: దురదృష్టం అంటే ఇదేనేమో.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడికి అనూహ్య ప్రమాదం.. ఏం జరిగిందంటే..

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియో దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``రేపు మెట్రోలోకి వాషింగ్ మెషిన్ తెచ్చి బట్టలు ఉతుక్కోండి. ఎల్లుండి బట్టలు ఐరన్ చేసుకోండి``, ``వెరీ ఫన్నీ``, ``ఢిల్లీ మెట్రోలో ఏదైనా సాధ్యమే``, ``ఢిల్లీ వాసులకు కనీసం సంస్కారం లేదని ఇతరులు అనుకుంటారు`` అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-18T16:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising