Viral: దురదృష్టం అంటే ఇదేనేమో.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడికి అనూహ్య ప్రమాదం.. ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-06-17T19:28:25+05:30 IST
ప్రస్తుతం గుజరాత్‌ను బిపోర్‌జాయ్ తుఫాను వణికిస్తోంది. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈదురు గాలుల ధాటికి చెట్లు, స్తంభాలు, స్తంభాలు, హోర్డింగ్‌లు కూలిపోతున్నాయి. ఎంతో మంది గాయపడుతున్నారు. ఈ రోజు (శనివారం) ఉదయం సూరత్‌లో ఓ వ్యక్తి అనూహ్య ప్రమాదానికి గురయ్యాడు.
ప్రస్తుతం గుజరాత్ (Gujarat)ను బిపోర్‌జాయ్ (Biporjoy ) తుఫాను వణికిస్తోంది. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు (Strong Winds) అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈదురు గాలుల ధాటికి చెట్లు, స్తంభాలు, స్తంభాలు, హోర్డింగ్‌లు కూలిపోతున్నాయి. ఎంతో మంది గాయపడుతున్నారు. ఈ రోజు (శనివారం) ఉదయం సూరత్ (Surat)లో ఓ వ్యక్తి అనూహ్య ప్రమాదానికి గురయ్యాడు. అయితే గాయాలతో బయటపడడం కాస్త ఊరట కలిగించే అంశం. ఆ ఘటన పొరుగు ఇంట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డైంది.
సూరత్‌లోని భేస్తాన్ ప్రాంతంలో ఓ యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. హఠాత్తుగా ఆ సమయంలో అతడిపై ఓ భారీ వాటర్ ట్యాంక్ పడింది (water tank fell on a young man). ఆ ట్యాంక్ కింద ఆ యువకుడు ఉండిపోయాడు. అయితే ఆ ట్యాంక్ ఖాళీగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్వల్పంగా వెన్నునొప్పి రావడంతో యువకుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ యువకుడి పక్కనే ఓ బాలిక కూడా ఉంది. ఆ బాలిక కూడా సురక్షితంగానే ఉంది. ఈదురు గాలులకు ఖాళీ వాటర్ ట్యాంక్ ఎగిరి వారిపై పడింది.
Bumper Offer: ఇలాంటి ఆఫర్‌ను ఎప్పుడూ విని ఉండరు.. అక్కడ నివసిస్తామంటే చాలు.. ఏకంగా రూ.70 లక్షలు ఇస్తారట..!

సూరత్ లో తుపాను (Cyclone) ప్రభావం అంతగా కనిపించకపోయినా రెండు రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. అయితే గాలులు మాత్రం బలంగా వీస్తున్నాయి. గంటకు 40 నుంచి 45 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. బిపోర్‌జాయ్ ధాటికి గుజరాత్ అతలాకుతలం అవుతోంది. వేల గ్రామాలు కరెంట్ లేక అంధకారంలో చిక్కుకుపోయాయి.