Bumper Offer: ఇలాంటి ఆఫర్‌ను ఎప్పుడూ విని ఉండరు.. అక్కడ నివసిస్తామంటే చాలు.. ఏకంగా రూ.70 లక్షలు ఇస్తారట..!
ABN , First Publish Date - 2023-06-17T17:58:07+05:30 IST
చుట్టూ కొండలు, సెలయేళ్లు, పచ్చని ప్రకృతి మధ్య జీవించడం ఎవరికీ ఇష్టం ఉండదు. అలాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం ఐర్లాండ్ ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది.
చుట్టూ కొండలు, సెలయేళ్లు, పచ్చని ప్రకృతి మధ్య జీవించడం ఎవరికీ ఇష్టం ఉండదు. అలాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం ఐర్లాండ్ (Ireland) ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. తమ దేశంలో ఉండే ఐలాండ్ (Islands)ల్లో నివసించేవారికి ఏకంగా రూ.70 లక్షలు ఇస్తామని ప్రకటించింది. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. ఐర్లాండ్ ప్రభుత్వం (Ireland Government) దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని దీవుల్లో స్థిరపడాలనుకుంటున్న వారి కోసం ఒక విధానాన్ని రూపొందించింది.
గత కొన్నేళ్లుగా ఐర్లాండ్‌లోని పల్లె వాసులు నగరాలకు తరలి వెళ్లిపోతున్నారు. దీంతో ఐర్లాండ్ గ్రామీణ జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ ప్రభుత్వం ``అవర్ లివింగ్ ఐలాండ్స్ పాలసీ`` (Our Living Islands Policy)ని రూపొందించింది. ఐర్లాండ్ మారుమూల ప్రాంతాల్లో ఉన్న దీవుల్లో నివసించడానికి సిద్ధపడే వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా రూ.70 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఐరిష్ ప్రభుత్వం మొత్తం 23 దీవులను ఎంపిక చేసింది. ఆయా ద్వీపాల్లో ఇల్లు కట్టుకుని నివసించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే రూ.70 లక్షలు రావాలంటే కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి.
Viral Video: కంగారూ దాడి నుంచి ఓ మహిళను కాపాడాడు.. తాను మాత్రం దొరికిపోయాడు.. వైరల్ అవుతున్న వీడియో!
ఆయా దీవుల్లో స్థిరపడాలనుకుంటున్న వారు ఆ ప్రాంతంలో 1993కి ముందు నిర్మించిన ఏదైనా ఇంటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బును ఇంటి పునరుద్ధరణకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఆఫర్ విదేశీయులకు వర్తించదు. ఐర్లాండ్ మాత్రమే కాదు.. స్పెయిన్, మారిషస్, గ్రీస్, క్రొయేషియా, ఇటలీ, చిలీ వంటి దేశాలు కూడా ఇప్పటికే ఇటువంటి ఆఫర్లను ప్రకటించాయి.