ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wife: అర్థం చేసుకునే భార్య దొరకడం అంటే ఇదే కదా.. భర్త బైక్ నడుపుతూ ఉంటే వెనుకే కూర్చున్న ఆమె ఏం చేసిందో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-05-26T13:15:48+05:30

అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే ఏ మగాడికైనా ఇంకేం కావాలి. మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్టుగా సాఫీగా సాగిపోతుంది సంసారం. ఇటీవల

Wife
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే ఏ మగాడికైనా ఇంకేం కావాలి. మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్టుగా సాఫీగా సాగిపోతుంది సంసారం. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో వరుడు మద్యం సేవించి పెళ్లిపీటలపైకి వచ్చాడని తనకు ఈ పెళ్లొద్దంటూ వధువు నిరాకరించి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎంత బతిమాలినా ససేమిరా అంది. చేసేదేమీలేక పెళ్లి రద్దు చేసుకుని ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. జీవిత భాగస్వామిని ఎంచుకునేవారు ఎలాంటి చెడు అలవాట్లు లేనివారే కావాలని కోరుకుంటారు. కానీ ఈ జంటను చూస్తే మాత్రం... వామ్మో ఇలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోవడం ఖాయం.

సహజంగా ఆడపిల్లలు పుట్టింట్లో అల్లారు ముద్దుగా పెరుగుతుంటారు. వారికి ఇల్లే లోకంగా ఉంటుంది. ఒక క్రమ శిక్షణలో పెరుగుతుంటారు. అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడూ మంచి సంబంధం చూసి.. మంచి గుణ లక్షణాలు ఉన్న అబ్బాయిను చూసి పెళ్లి చేస్తారు. వారిద్దరూ బాగుండాలని కోరుకుంటారు. కానీ సోషల్ మీడియాలో ఈ విచిత్రమైన వీడియో వైరల్‌గా మారింది. పెళ్లయ్యాక.. భార్యకు నచ్చజెప్పాడో.. లేదంటే ఏముందిలే అనుకుందో ఏమో తెలియదు గానీ ఆమె చేసిన పని మాత్రం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ధూమపానం అనేది చాలా మందికీ పడదు. ఇక ధూమపానం ప్రమాదకరమని తెలుసు.. పబ్లిక్‌గా దాన్ని కాల్చడం కూడా నేరం. అయినా కూడా చాలా మంది ధూమపానం చేస్తూనే ఉంటారు. అయితే ఓ భార్య (wife helping) తన భర్తకు స్వయంగా సిగరెట్ (husband smoke) అందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చాలా మంది భార్యలు.. భర్తల ధూమపానంపై ఇబ్బంది పడిన దాఖలాలు చాలా చూశాం. కానీ పొగ త్రాగడానికి స్వయంగా అర్థాంగే సహాయ పడడం ఎక్కడా చూడలేదు. ఈ ఇల్లాలికి ఇంత గొప్ప హృదయం కలదా? అని ఆశ్చర్యం వేస్తోంది. భర్త స్కూటర్‌ నడుపుతుంటూ భార్య అతనికి సిగరెట్ అందిస్తూ.. అతడు అడిగినప్పుడల్లా అందిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఓ జంట స్కూటర్‌పై (scooter ride) ప్రయాణిస్తున్నారు. మహిళ ఒక చేతిలో జెండా పట్టుకుని.. మరో చేత్తో సిగరెట్ పట్టుకుని ఉంది. స్కూటర్ ముందు ఓ పిల్లాడు కూడా కూర్చున్నాడు. ఇదంతా పక్కన వెళ్తున్న కారు ప్రయాణికులు ఈ వీడియో తీశారు. స్కూటీ నడుపుతూనే అతడు సిగరెట్ అడుగుతున్నట్లు కనిపించింది. అందుకు అతని భార్య అతని నోటికి సిగరెట్ అందిస్తూ వచ్చింది. అతడు అడిగినప్పుడల్లా సిగరెట్ అందించింది. ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ హస్నా జరూరీ హై షేర్ చేశారు. ఈ వీడియో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు రకరకాలైన కామెంట్లు చేస్తున్నారు. ‘నాకు ఇలాంటి భార్య ఉంటే బాగుండేది’ అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Bride: వరుడి మెడలో దండ వేయకుండా.. సడన్‌గా గదిలోకి వెళ్లిపోయిన వధువు.. పెళ్లికొడుకు ఫ్రెండ్స్ చేసిన నిర్వాకంతో..!

ఇది కూడా చదవండి: Hyderabad: పెళ్లయి పట్టుమని ఏడాది.. ఏం పాపం చేశారని ఈ జంటకు ఇంత పెద్ద శిక్ష..!

Updated Date - 2023-05-26T13:16:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising