ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకరి తర్వాత మరొకరు 24 గంటల్లోనే ముగ్గురు పిల్లల మృతి.. భార్యపైనే ఆ భర్తకు అనుమానం అసలు కథేంటంటే..!

ABN, First Publish Date - 2023-02-02T19:52:56+05:30

'ఏమండీ.. మన ముగ్గురు పిల్లలకు ఆరోగ్యం బాగలేదు వాంతులు అవుతున్నాయి, మీరు తొందరగా వచ్చెయ్యండి' అంటూ భర్తకు ఫోన్ చేసింది ఆమె. అతను దారిలో ఉండగా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'ఏమండీ.. మన ముగ్గురు పిల్లలకు ఆరోగ్యం బాగలేదు వాంతులు అవుతున్నాయి, మీరు తొందరగా వచ్చెయ్యండి' అంటూ భర్తకు ఫోన్ చేసింది ఆమె. అతను దారిలో ఉండగా ఒకరు చనిపోయారు, ఇంకా ఇద్దరిని హాస్పిటల్ తీసుకెళుతున్నాం' అని చెప్పారు. తీరా చూస్తే మిగిలిన ఇద్దరూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆ భర్త నేరుగా భార్యమీదనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అయోమయానికి గురిచేసే ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలో పంజిత్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ముర్సాలిన్ అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. ముర్సాలిన్ ఢిల్లీలో ఫర్నిచర్ షాప్ లో పనిచేస్తుంటాడు. దాంతో పంజిత్ గ్రామంలో భార్య సల్మా వారి ఐదుమంది పిల్లలు, ముర్సాలిన్ తల్లిదండ్రులతో కలసి ఉంటోంది. ముగ్గురు పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని సల్మా ఫోన్ చేయడంతో ముర్సాలిన్ హడావిడిగా ఢిల్లీ నుండి బయలుదేరాడు. అయితే అతను దారిలో ఉండగానే ఆరేళ్ళకొడుకు చనిపోయాడని 4ఏళ్ళ కూతురు, 16నెలల మరో కూతురిని హాస్పిటల్ కు తీసుకెళుతున్నామని ముర్సాలిన్ తండ్రి ఫోన్లో చెప్పాడు. ముర్సాలిన్ హాస్పిటల్ కు చేరుకునేసరికి ఆ ఇద్దరు పిల్లలు కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఒంటరిగా బైక్‌పై వెళ్లే కుర్రాళ్లూ జర జాగ్రత్త.. అమ్మాయి అడిగింది కదా అని లిఫ్ట్ ఇచ్చాడో యువకుడు.. అంతే..

ముర్సాలిన్ వెంటనే భార్య సల్మా మీద, సల్మా తల్లిమీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. 'మా ఇద్దరి మధ్య గొడవల కారణంగానే పిల్లలకు విషం ఇచ్చి చంపేశారు' అని ఆరోపించాడు. పోలీసులు ముర్సాలిన్ ఇంట్లో నీటి కూజా, పిల్లలకు వాంతులు అయినప్పుడు శుభ్రం చేసిన బట్టలు మొదలయినవి స్వాధీనం చేసుకున్నారు. అలాగే సల్మాను అదుపులోకి తీసుకున్నారు. ఆమె పిల్లలకు పాలల్లో విషం ఇచ్చినట్టు ఆరోపిస్తున్నారు. మిగిలిన పిల్లలు ఇద్దరు ఆసమయంలో ఇంట్లో లేరని, లేకపోతే వాళ్ళు కూడా చనిపోయేవాళ్ళని ముర్సాలిన్ చెప్పాడు. పిల్లల పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తరువాత వారు ఏ కారణంతో చనిపోయారనే విషయాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సల్మాను విచారిస్తున్నారు.

ప్రేమ పెళ్లి చేసుకున్న 7 నెలలకే ఊహించని షాక్.. అర్ధరాత్రి కట్టుకున్న భార్యే ఆ భర్త గొంతు కోసింది..!

Updated Date - 2023-02-02T19:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising