ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking Video: అంటార్కిటికాలో షాకింగ్ దృశ్యం.. గ్లాస్‌లో బీర్ వేసేటపుడు ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Dec 23 , 2023 | 09:13 PM

చలికాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది స్వెట్టర్లు వేసుకుని, చలి మంటలు వెలిగించుకుని కూర్చుంటారు. ఉష్ణోగ్రతలు పడిపోతే చలికి గజగజ వణుకుతారు. అయితే ఈ భూమి మీద కొన్ని ప్రాంతాలు ఎప్పుడూ దట్టమైన మంచుతో నిండి ఉంటాయి.

చలికాలం (Winter) వచ్చిందంటే చాలు మనలో చాలా మంది స్వెట్టర్లు వేసుకుని, చలి మంటలు వెలిగించుకుని కూర్చుంటారు. ఉష్ణోగ్రతలు పడిపోతే చలికి (Cold) గజగజ వణుకుతారు. అయితే ఈ భూమి మీద కొన్ని ప్రాంతాలు ఎప్పుడూ దట్టమైన మంచుతో నిండి ఉంటాయి. దక్షిణ ధ్రువం (South Pole) దగ్గర ఉన్న అంటార్కిటాలో (Antarctica) పరిస్థితిని కళ్లకు కడుతున్నట్టు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video). అక్కడ ప్రస్తుతం -64 డిగ్రీల వాతావరణం ఉంది.

thejeffcapps అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఓ వీడియో చాలా మందికి షాక్ కలిగిస్తోంది. -64 డిగ్రీల చలిలో తిరుగుతున్న జెఫ్.. క్యాన్ నుంచి బీర్‌ (Beer)ను గ్లాసులో వేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సెకెండ్ల వ్యవధిలోనే బీరు గడ్డకట్టేసింది. గ్లాస్, బీర్, క్యాన్ ఒకదానికొకటి అతుక్కుపోయి ఉండిపోయాయి. అతడు మంచు కురుస్తుండగా అంటార్కిటికాలో తిరుగతూ అక్కడి పరిస్థితిని వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా వీక్షించారు.

ఆ షాకింగ్ వీడియోను 1.65 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``అక్కడ ఎంత సమయం బయట తిరగగలరు``, ``అలాంటి ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకూడదు``, ``చాలా అసాధారణం``, ``వామ్మో.. బీరు గడ్డకట్టుకుపోయింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Dec 23 , 2023 | 09:13 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising