ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: తన కోపాన్ని గాడిద మీద చూపిస్తూ చితకబాదిన కుర్రాడు.. చినరికి అతనికి ఏం జరిగిందో చూడండి.

ABN, First Publish Date - 2023-03-19T18:03:19+05:30

అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు అనే సామెత మన పెద్దోళ్ళు ఇలాంటి వాళ్ళను చూసే అన్నారేమో.. గాడిదను దారుణంగా కొట్టి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు అనే సామెత మన పెద్దోళ్ళు ఇలాంటి వాళ్ళను చూసే అన్నారేమో.. అతనికి ఎవరిమీద కోపముందో.. ఎందుకు కోపమొచ్చిందో తెలీదు. తనలో ఉన్న అసహనాన్ని, కోపాన్ని తన ఎదురుగా ఉన్న గాడిద(Donkey) మీద తీర్చుకున్నాడు. గాడిదను దారుణంగా కొట్టి, దానిమీద ఎక్కి అతనిలో ఉన్న పైశాచికత్వాన్ని బయటపెట్టాడు. అయితే ఆ తరువాత సీన్ వేరేగా ఉంది. తనను ఇష్టానుసారం కొట్టిన వ్యక్తికి ఆ గాడిద తగిన గుణపాఠం చెప్పింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

కొందరు తమలో ఉన్న కోపాన్ని ఆ కోపానికి కారణమైన వారపై కాకుండా ఏమీ మాట్లాడలేని అమాయకులమీదా.. మూగజీవుల మీదా చూపిస్తుంటారు. అదేవిధంగా ఒక వ్యక్తి తనలో అసహనాన్ని, కోపాన్ని తన ఎదురుగా ఉన్న గాడిదపై చూపాడు. అతనికి గాడిద మీద కోపమొచ్చిందో లేక వేరే వారిమీద ఉన్న కోపం గాడిద ముందు బయటపెట్టాడో తెలీదు. తన ఎదురుగా ఉన్న గాడిదను దారుణంగా బలం కొద్దీ కొట్టాడు. తరువాత గాడిద మీద ఎక్కి దాన్ని హింసించడం మొదలుపెట్టాడు. అప్పటివరకు అతని వెర్రి చేష్టలను భరించిన ఆ గాడిదకు ఒక్కసారిగా బి.పి పెరిగిపోయినట్టుంది. తన మీద కూర్చున్న కుర్రాడిని కిందకు పడేసింది. అంతటితో ఆగకుండా ఆ కుర్రాడి కాలు పట్టుకుని కొరికేసింది.అతని కాలు నోట కరుచుకుని అలాగే రౌండ్స్ కొట్టింది. తనను వేధించినందుకు అతని మీద అంతకంతా పగ తీర్చుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Vids that go hard అనే ట్విట్టర్ యూజర్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో చూసినవారు ఆ గాడిద కుర్రాడికి మంచి గుణపాఠం చెప్పింది అంటున్నారు. ఎంత నోరు లేని జీవులైతే మాత్రం అంత విచక్షణా రహితంగా ప్రవర్తిస్తారా బాగా శాస్తి జరిగిందని కామెంట్ చేస్తున్నారు.

Read also: Viral Video: పిల్లి ఏం చేస్తుందిలే అని మింగడానికి సిద్దమైన పాము.. ఆ పిల్లి ఏం చేసిందో చూడండి..


Updated Date - 2023-03-19T18:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising