Viral Video: పిల్లి ఏం చేస్తుందిలే అని మింగడానికి సిద్దమైన పాము.. ఆ పిల్లి ఏం చేసిందో చూడండి..

ABN , First Publish Date - 2023-03-19T16:39:26+05:30 IST

. పిల్లిని మింగడానికి ఇంత నోరు తెరిచిన పామును చూస్తే భయం పుట్టడం పక్కా..

 Viral Video: పిల్లి ఏం చేస్తుందిలే అని మింగడానికి సిద్దమైన పాము.. ఆ పిల్లి ఏం చేసిందో చూడండి..

ఈ ప్రకృతిలో ఒక జంతువు మీద మరొక జంతువు దాడి చేయడం సహజం. అలాగే ప్రతి ప్రాణి తనను తాను కాపాడుకోవడానికి శాయాశక్తులా ఎంతకైనా తెగించడం సహజం. పాములు సాధారణంగా ఎలుకలను తింటాయని మనకు తెలుసు. కొన్ని పెద్ద పాములు పెద్ద జంతువులను తినడానికి ప్రయత్నం చేస్తాయి. అదేవిధంగా ఓ పాము పిల్లిని టార్గెట్ చేసుకుంది.'మ్యావ్ అని అరవడం, దొంగగా పాలు తాగడం తప్ప దానికేమొస్తుంది? ఫైటింగ్ చేయడం కథ దేవుడెరుగు, నాకంటే వేగంగా రన్నింగ్ కూడా చేయలేదు. దాన్ని లటుక్కున పట్టేసి మింగేయాలి' అనుకుంది. కానీ పాపం పిల్లి మామ చేతిలో పాము భంగపడింది. అది మామూలుగా కూడా కాదు. రెండే రెండు దెబ్బలతో పాము పని ఫినిష్ అయింది. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి వివరంగా తెలుసుకుంటే..

ఒకపాము(Snake) రెండు పిల్లులను(Two Cats) వెంటాడుతూ వెళ్ళింది. ఆ రెండు పిల్లులూ ఒక దగ్గర ఆగిపోయాయి. ఆ పాము కూడా ఆ పిల్లుల దగ్గర ఆగింది. పిల్లులు ఇక తప్పించుకోలేని మూమెంట్లో ఉన్నప్పుడు పాము ఒక పిల్లిని మింగడానికి దగ్గరగా వెళ్ళింది. పాము పిల్లి ముఖం దగ్గరకు తన ముఖాన్ని తీసుకెళ్ళి నోరు తెరిచింది. అప్పుడే సీన్ మొత్తం రివర్స్ అయింది. పాము కసితో నోరు తెరచి పిల్లి ముఖం దగ్గరకు వెళ్ళగానే పిల్లి తనదైన చేతివాటం చూపించింది. సహజంగా ఏదైనా మీదకు పచ్చినా, ఎవరైనా దాన్నిటచ్ చెయ్యాలని చూసినా పిల్లి దాని కాలుతో ఒక్క దెబ్బ వేగంగా వేస్తుంది. దీంతో పొడుచుకొచ్చిన దాని గోళ్ళు ఎదుటివారి చర్మంమీద గీరుకుపోయి రక్తం కారుతుంది.

పిల్లి దెబ్బకు పాము ఒక్కసారిగా నేలకు అతుక్కుపోయింది. పాము రెండోసారి పిల్లిమీదకు వెళ్ళగా పిల్లి మళ్ళీ అదే పంచ్ ఇచ్చింది. రెండు దెబ్బలు తగిలేసరికి పామురాజుకు చుక్కలు కనబడి చచ్చినంత పనయింది. ఈ వీడియోను Weired and Terrifying అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ పిల్లి చేసిన పని ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పిల్లే కదా అనుకుంటే చంపి పాతరేస్తుందిరోయ్ అంటున్నారు నెటిజన్లు.

Read also: బోలెడు రోగాలు బాధిస్తున్నాయా? రాత్రి పడుకునే ముందు బొడ్డు దగ్గర ఇలా చేసి చూడండి.. ఫలితం చూసి మీరే షాకవుతారు..


Updated Date - 2023-03-19T17:27:54+05:30 IST