ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పెళ్లి వేదికపై వరుడి డాన్స్.. వధువు కూడా కాలు కదిపేందుకు రెడీ అవుతుండగా సడన్‌గా అత్త ఎంట్రీ.. చివరకు..!

ABN, First Publish Date - 2023-06-05T16:58:28+05:30

స్నేహితులు, బంధుమిత్రులు, అతిథుల సమక్షంలో పెళ్ళిళ్ళు(Marriages) ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలో భాగంగా ఈ మధ్యకాలంలో వధూవరులు డ్యాన్స్ చెయ్యడం పరిపాటిగా మారింది. వీడియోలో ఓ పెళ్ళివేడుకలో వరుడు పెళ్ళివేదికపై నిలబడుకుని డాన్స్ చేస్తోంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్ళి అంటేనే బోలెడంత సంబరం. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళలో డీజే లు, డ్యాన్సులు ఊపందుకున్నాయి. వధూవరుల వైపు బంధువులే కాదు వధూవరులు కూడా పెళ్ళి సంబరంలో కాలు కదిపి కుటుంబ సభ్యులను, అతిథులను అలరిస్తుంటారు. తమ పెళ్ళిని మధుర జ్ఞాపకంగా మార్చుకుంటున్నారు. ఓ పెళ్ళివేడుకలో వరుడు పెళ్ళివేదికపై డ్యాన్స్ అదరగొడుతున్నాడు. అతనితో కలసి డ్యాన్స్ వేయడానికి వధువు సిద్దమవుతుండగా షాకింగ్ సంఘటన జరిగింది. సడెన్ గా వధువరులిద్దరి మధ్య వధువు తల్లి ఎంట్రీ ఇచ్చింది. అత్తగారు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడి వాతావరణం ఉత్కంఠగా మారింది. ఆ తరువాత అత్తగారి ముందు వరుడు చేసిన పని చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

స్నేహితులు, బంధుమిత్రులు, అతిథుల సమక్షంలో పెళ్ళిళ్ళు(Marriages) ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలో భాగంగా ఈ మధ్యకాలంలో వధూవరులు డ్యాన్స్ చెయ్యడం పరిపాటిగా మారింది. వీడియోలో ఓ పెళ్ళివేడుకలో వరుడు(groom dance on stage) పెళ్ళివేదికపై నిలబడుకుని నడుము అటూ ఇటూ ఊపుతూ పాములాగా డాన్స్ చేస్తున్నాడు. అతను ఎంతో ఉత్సాహంతో డాన్స్ వేస్తోంటే వధువు(bride) కూడా అతనితో కాలు కదపడానికి సిద్దమవుతోంది. సరిగ్గా అప్పుడే అక్కడికి వధువు తల్లి(bride mother) ఎంట్రీ ఇచ్చింది. ముఖానికి పొడవుగా కొంగు కప్పుకున్న ఆమె వరుడితో కలసి డాన్స్ చేయడం మొదలుపెట్టింది. తన అత్తగారు(mother-in-law) ఎంట్రీ ఇచ్చేసరికి వరుడు ఏమాత్రం కంగారు పడలేదు. అతను ఎంతో ఉత్సాహంగా ఆమెతో డాన్స్ చేయడం మొదలుపెడతారు. ఈ క్రమంలో తన తల్లి డ్యాన్స్ చేస్తుండటం చూసి వధువు కూడా వారితో కలిసి డాన్స్ చేస్తుంది. వేదిక మీద వారు ముగ్గురూ డాన్స్ చేస్తున్నా ముగ్గురిలోకి వధువు తల్లి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. వధువు తల్లి చాలా ఉత్సాహంగా, మరెంతో ఎనర్జీతో డాన్స్ వేయడం చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఆమె డాన్స్ ను అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

Bluetooth: మీ ఫోన్లలో బ్లూటూత్‌ను ఎప్పుడూ ఆన్ చేసే ఉంచుతున్నారా..? అయితే మీరు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టే..!


ఈ వీడియోను bridal_lehanga_d అనే ఇన్స్టాగ్రామ్ పేజీ(Instagram) నుండి షేర్ చేశారు. 'అసలు అక్కడ ఏం జరుగుతోంది బ్రదర్..' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'ఆ అత్తగారి ఎనర్జీ లెవల్స్ మామూలుగా లేవు' అని అంటున్నారు. 'ఆ అత్తగారి ఉత్సాహం చూస్తుంటే ప్రతి ఒక్కరికీ డాన్స్ చేయాలని అనిపిస్తుంది' అని కామెంట్స్ చేస్తున్నారు. 'అత్తా అల్లుడు డాన్స్ ఇరగదీశారు' అని అంటున్నారు.

Health Tips: 30,40,50.. ఏ వయసులో ఏ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలో తెలుసా? ఈ పరీక్షల వల్ల ఏం జరుగుతుందంటే..


Updated Date - 2023-06-05T16:58:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising