ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: చిన్న పిల్లలు వేసుకునే ఈ టీ షర్టులో ఏముంది..? ఆనంద్ మహీంద్రాకు ఎందుకు ఇంతగా నచ్చేసిందంటే..!

ABN, First Publish Date - 2023-05-26T18:17:30+05:30

'ఈ టీ షర్ట్ కే నా ప్రాధాన్యత, ఇది నాకు చాలా బాగా నచ్చేసింది' అంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియా బాగా వినియోగించేవారికి ఆనంద్ మహీంద్రా ను ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కివో మంచి మంచి విషయాలు షేర్ చేస్తూ తనను అనుసరించేవారిని ఎంటర్టైన్ చేస్తుంటారాయన. తాజాగా ఆయన 'ఈ టీ షర్ట్ కే నా ప్రాధాన్యత, ఇది నాకు చాలా బాగా నచ్చేసింది' అంటూ ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'నిజంగానే ఈ టీ షర్ట్ అద్భుతం' అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో కొత్త కొత్త విషయాలను తన అనుచరులకు పరిచయం చేయడంలో ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయనొక వీడియో షేర్ చేశారు. చిన్న పిల్లలు ధరించే టీ షర్ట్ కు(Kids wear t-shirt) సంబంధించిన వీడియో అది. చిన్నపిల్లలు నీటిలో పడి మృతిచెందారనే వార్త చాలా చోట్ల వింటూ ఉంటాము. దానికి పరిష్కారంగా Floatee అనే ఫ్రెంచ్ సంస్థ ఓ బుల్లి టీ షర్ట్ తయారుచేసింది. ఆ టీ షర్ట్ చూడటానికి చాలా నార్మల్ గా ఉన్నా అది వేసుకున్న పిల్లలు నీటిలో పడగానే అది లైఫ్ బోట్(t-shirt turn as life boat) లాగా మారిపోతుంది. పిల్లలు నీటిలో మునగకుండా కాపాడుతుంది. పిల్లల తల నీటిలో మునగకుండా కవర్ చేస్తుంది. ఈ కారణంగా పిల్లల చెవులలోకి కూడా నీరు వెళ్లే అవకాశాలు లేవు. వీడియోలో ఓ వ్యక్తి చేతిలో ఓ బొమ్మ ఉంది. దానికి వారు కొత్తగా ఆవిష్కరించిన టీ షర్ట్ వేశారు. బొమ్మను పట్టుకున్న వ్యక్తి దాన్ని తన ఎదురుగా ఉన్న నీటి తొట్టెలో(Water tank) వేశాడు. అతడు దాన్నలా వేయగానే అప్పటి వరకు నార్మల్ గా ఉన్న ఆ టీ షర్ట్ లైఫ్ బోట్ లాగా మారిపోయింది. పిల్లలు నీటిలో మునగకుండా ఉండటానికి చాలా సురక్షితమైనదిగా ఈ టీ షర్ట్ కనిపిస్తోంది.

Viral Video: చనిపోయిన భార్య ఫొటోలను చేతిలో పట్టుకుని.. ఈ వృద్ధుడు చేస్తున్న పనేంటో చూస్తే కన్నీళ్లు రావడం ఖాయం..!


ఈ వీడియోను anand mahindra తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. 'దీనికి నోబెల్ బహుమతి రాకపోవచ్చు, కానీ నోబెల్ బహుమతి పొందిన వాటికంటే ఇది చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లల తాతగా, వారి క్షేమం, భద్రతేకే నా అత్యధిక ప్రాధాన్యత' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో నెటిజన్లును చాలా ఆకట్టుకుంటోంది. చాలామంది ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు. 'చిన్నపిల్లలకు చాలా వరకు నీటి దగ్గరే ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. అవన్నీ ఈ టీ షర్ట్ తో తప్పిపోతాయి' అని అంటున్నారు. 'ఇది చాలా గొప్ప ఆవిష్కరణ' అని కామెంట్స్ చేస్తున్నారు. 'దీని సహాయంతో పిల్లకు ఈత నేర్పించడం చాలా సులువు అవుతుంది' అని అంటున్నారు.

Crime: వైజాగ్ అమ్మాయినని చెప్పి ఇంత పని చేసిందేంటి..? నిండా మునిగిపోయిన బెంగళూరు కుర్రాడు.. రూ.23 లక్షలు మటాష్..!


Updated Date - 2023-05-26T18:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising