Crime: వైజాగ్ అమ్మాయినని చెప్పి ఇంత పని చేసిందేంటి..? నిండా మునిగిపోయిన బెంగళూరు కుర్రాడు.. రూ.23 లక్షలు మటాష్..!

ABN , First Publish Date - 2023-05-26T15:43:54+05:30 IST

బెంగుళూరుకు చెందిన ఓ కుర్రాడికి వైజాగ్ కు చెందిన ఓ అమ్మాయితో పరిచయం అయ్యింది. వారిద్దరూ మంచి స్నేహితులుగా కూడా మారారు. కానీ ఉన్నపళంగా ఆ అమ్మాయి చేసిన పనికి..

Crime: వైజాగ్ అమ్మాయినని చెప్పి ఇంత పని చేసిందేంటి..? నిండా మునిగిపోయిన బెంగళూరు కుర్రాడు.. రూ.23 లక్షలు మటాష్..!

ఈ మధ్యకాలంలో మోసాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాగా చదువుకున్నవారు కూడా ఈ పొరపాట్లు చేసేస్తారు. ఆ తరువాత దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. బెంగుళూరుకు చెందిన ఓ కుర్రాడికి వైజాగ్ కు చెందిన ఓ అమ్మాయితో పరిచయం అయ్యింది. వారిద్దరూ మంచి స్నేహితులుగా కూడా మారారు. కానీ ఉన్నపళంగా ఆ అమ్మాయి చేసిన పనికి ఆ కుర్రాడికి చుక్కలు కనబడ్డాయి. ఒకటి రెండూ కాదు ఏకంగా 23లక్షల రూపాయలు అతని చెయ్యి జారిపోయాయి. షాకింగ్ గా ఉన్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు(Bangalore) నగరంలోని కెఆర్ పురంలో నివసిస్తున్న ఓ కుర్రాడు ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను తన ఖాళీ సమయాల్లో కాక్ పైట్ అనే ఆన్లైన్ గేమ్(cockfight online game) ఆడేవాడు. 2022 ఆగస్టు నెలలో అతనికి టెలిగ్రామ్(Telegram) లో ధనలక్ష్మి అనే మహిళ పరిచయం అయింది. తనది ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్(Vizag in Andhra Pradesh) అని ఆ మహిళ తనను తాను ఆ కుర్రాడికి పరిచయం చేసుకుంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య చనువు పెరిగింది. ఫోన్ నెంబర్లు షేర్ చేసుకున్నారు. ఒకరోజు ధనలక్ష్మి కుర్రాడితో తన ఆర్థిక పరిస్థితి బాలేదని తనకు 20వేల రూపాయలు అప్పు కావాలని అడిగింది. ఆమె పరిస్థితికి పాపం అనిపించి ఆ కుర్రాడు ధనలక్ష్మికి 20వేలు పంపించాడు. ఆ తరువాత వారి మధ్య మరింత చనువు పెరిగింది. ఒకరోజు ధనలక్ష్మి అతనికి వాట్సప్ వీడియో కాల్(Women make WhatsApp video call) చేసింది. ఆ సమయంలో ఆమె సరిగా దుస్తులు ధరించలేదు. ఆమెను చూసి టెంప్ట్ అయిన కుర్రాడు తను కూడా దుస్తులు తొలగించాడు. కానీ అదంతా ధనలక్ష్మి రికార్డ్ చేస్తుందని అతను ఊహించలేకపోయాడు. ఆ కాల్ తరువాత ధనలక్ష్మి అతనికి రికార్డ్ చేసిన వీడియో పంపించి డబ్బు డిమాండ్ చెయ్యడం మొదలుపెట్టింది. అతను తన దగ్గరున్న డబ్బంతా ఆమెకు సమర్పించుకున్నాడు. తన దగ్గర డబ్బులేకపోతే ఆమెకు భయపడి లోన్లు తీసుకుని మరీ ఆమె చెప్పిన రెండు ఖాతాలకు సెండ్ చేశాడు. ఇలా ఏకంగా ఒకటి, రెండు కాదు 23లక్షల రూపాయలు ఆమెకు పంపించాడు.

Snake Video: మనిషి టచ్ చేయగానే.. మరుక్షణంలోనే చనిపోయిన పాము.. ఏంటీ నమ్మలేకపోతున్నారా..? ఈ వీడియోను చూస్తే..!


తన సేవింగ్స్, లోన్లు, ఇతరులతో అప్పులు ఇలా అన్నీ చేసి ఇక తనకు డబ్బు పుట్టక అతను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాడు. ఈ క్రమంలో తనను కలిసిన స్నేహితులతో జరిగిన విషయం మొత్తం చెప్పగా మొదట పోలీసులను ఆశ్రయించమని స్నేహితులు సలహా ఇచ్చారు. దీంతో అతను బెంగుళూరు వైట్ ఫీల్డ్ CEN క్రైమ్ పోలీలకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తొందరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

Viral Video: చనిపోయిన భార్య ఫొటోలను చేతిలో పట్టుకుని.. ఈ వృద్ధుడు చేస్తున్న పనేంటో చూస్తే కన్నీళ్లు రావడం ఖాయం..!


Updated Date - 2023-05-26T15:43:54+05:30 IST