Viral Video: చనిపోయిన భార్య ఫొటోలను చేతిలో పట్టుకుని.. ఈ వృద్ధుడు చేస్తున్న పనేంటో చూస్తే కన్నీళ్లు రావడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-05-26T13:24:21+05:30 IST

మూడుముళ్ళ బంధంతో తనవెంట వచ్చి తనను పసిబిడ్డలా చూసుకున్న భార్య చనిపోయాక ఓ తాతగారి పరిస్థితి చాలా ధీనంగా మారింది. భార్య ఫోటోలు పట్టుకుని ఆయన చేస్తున్న పని చూస్తే

Viral Video: చనిపోయిన భార్య ఫొటోలను చేతిలో పట్టుకుని.. ఈ వృద్ధుడు చేస్తున్న పనేంటో చూస్తే కన్నీళ్లు రావడం ఖాయం..!

ఈ ప్రపంచంలో భార్యాభర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. మధ్యలో ముడిపడే ఈ బంధం ప్రాణం పోయే వరకు తోడుంటుంది. భార్యాభర్తలలో ఎవరు దూరమైనా మరొకరు ఒంటరిజీవితం గడుపుతూ భాగస్వామి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతారు. మూడుముళ్ళ బంధంతో తనవెంట వచ్చి తనను పసిబిడ్డలా చూసుకున్న భార్య చనిపోయాక ఓ తాతగారి పరిస్థితి చాలా ధీనంగా మారింది. భార్య ఫోటోలు పట్టుకుని ఆయన చేస్తున్న పని చూసి అందరి కళ్ళూ చెమర్చుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..

వివాహబంధం(Marriage relationship) గొప్పదని అందరూ అంటారు. ముఖ్యంగా ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలను చూసినా, జీవిత భాగస్వామి కోసం తాపత్రయపడేవాళ్ళను చూసినా వివాహ బంధం మీద గౌరవం పెరుగుతుంది. ఓ తాతగారు(Old man) తన భార్య మరణం తరువాత ఎంత బాధపడుతున్నారో(old man sad feeling after wife death) ఓ చిన్న సంఘటన ద్వారా బయటపడింది. వీడియోలో ఓ తాతగారు షోడా బండి(soda cart) ముందు ఉన్నారు. ఆయన ఒక గ్లాస్ షోడా(old man buy a glass of soda) కొనుగోలు చేశాడు. తను తాగడానికి ముందు తన వెంటే ఉంచుకున్న తన భార్య ఫోటోలు(wife photos) బయటకు తీసి షోడా గ్లాసును ఫోటోలకు ఆనించాడు. షోడా ఆమె తాగినట్టు ఫీలయ్యాక ఆ తరువాత తను తాగాడు. షోడా బండి దగ్గరున్న ఓ వ్యక్తి ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: ఈ జింక ఎందుకిలా చేస్తోంది..? ఆ చిన్నారి అసలేం చెప్పింది..? నెటిజన్ల మనసును కట్టిపడేస్తున్న వీడియో ఇది..!


ఈ వీడియోను gurpinder_sandhu33_ అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. 'ఈ రోజు నేను చూసిన గొప్ప వీడియో ఇది' అని ఒక యూజర్ కామెంట్ చేశారు. 'నిజమైన ప్రేమ అంటే ఏంటి అని ఎవరైనా అడిగినప్పుడు నేను ఈ వీడియో చూపిస్తాను' అని మరొకరు అన్నారు. 'భార్యను ఎంతగా ప్రేమించకపోతే ఆ తాతగారు అలా ప్రవర్తిస్తారు' అని భావోద్వేగానికి లోనవుతున్నారు.

Snake Video: మనిషి టచ్ చేయగానే.. మరుక్షణంలోనే చనిపోయిన పాము.. ఏంటీ నమ్మలేకపోతున్నారా..? ఈ వీడియోను చూస్తే..!


Updated Date - 2023-05-26T13:24:21+05:30 IST