ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ముళ్లపందితో పెట్టుకుంటే పులి అయినా పిల్లి అవ్వాల్సిందే.. పిల్లలను కాపాడుకునేందుకు ఏం చేశాయంటే..

ABN, First Publish Date - 2023-01-22T13:05:52+05:30

పేరుకు పులే అయినా కొన్నిసార్లు చిన్న చిన్న జంతువుల ముందు కూడా తోక ముడవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. తమ పిల్లలను కాపాడుకునే క్రమంలో కొన్ని చిన్న జంతువులు కూడా పులులు, సింహాలతో పోరాడుతుంటాయి. ఇలాంటి సమయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేరుకు పులే అయినా కొన్నిసార్లు చిన్న చిన్న జంతువుల ముందు కూడా తోక ముడవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. తమ పిల్లలను కాపాడుకునే క్రమంలో కొన్ని చిన్న జంతువులు కూడా పులులు, సింహాలతో పోరాడుతుంటాయి. ఇలాంటి సమయంలో చాలాసార్లు అంతిమంగా చిన్న జంతువులదే పైచేయి అవుతుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం పులితో పోరాడిన ముళ్లపందుల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తమ పిల్లలను కాపాడుకునే క్రమంలో ఏకంగా పులికే ఎదురు నిలుస్తాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు.

Viral Video: రైలు కదులుతుండగానే డోర్ తెరచి దిగేసిన వ్యక్తి.. చివరికి ఏమైందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. అటవీ ప్రాంతంలోని రోడ్డుపై రెండు ముళ్లపందులు (porcupines) తమ పిల్లలతో కలిసి వెళ్తుంటాయి. అదే సమయంలో అక్కడికి ఓ చిరుత పులి (Leopard) వస్తుంది. ముళ్లపంది పిల్లలను ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ వేస్తుంది. కానీ పులిని గమనించిన ముళ్లపందులు.. వెంటనే పిల్లలకు రక్షణగా నిలుస్తాయి. తమ పొడవాటి ముళ్లులతో పులి మీద దాడి (attack) చేస్తాయి. దీంతో వాటి పిల్లలను కనీసం తాకడానికి కూడా పులి వల్ల సాధ్యం కాదు. కానీ చాలా సేపు వాటిని ఎత్తుకెళ్లాలని ప్రయత్నిస్తుంది.

మద్యం మత్తులో రాత్రి వేళ ప్రియురాలి ఇంటికి వెళ్లిన యువకుడు.. కాసేపటి తర్వాత ఇంకో ఇద్దరు లోపలికి రావడంతో..

అయినా ముళ్లపందులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా పులికి చుక్కలు చూపిస్తాయి. ఒకానొక సందర్భంలో ముళ్లులతో గట్టిగా పొడుస్తాయి. దీంతో చాలా ముళ్లులు పులి మూతి, కాలికి గుచ్చుకుంటాయి. వాటిని తొలగించుకునేందుకు చిరుత పులి తెగ ఇబ్బంది పడుతుంది. చివరకు తన వల్ల కాదని తోక ముడుస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొంత మంది తమ కెమెరాల్లో బంధిస్తారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

టీటీఈ చెప్పడంతో ఫ్రీగా ఏసీ బోగీలో కూర్చున్న మహిళ.. అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు దగ్గరికి రావడంతో.. ఎవరా అని చూడగా..

Updated Date - 2023-01-22T13:05:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising