టీటీఈ చెప్పడంతో ఫ్రీగా ఏసీ బోగీలో కూర్చున్న మహిళ.. అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు దగ్గరికి రావడంతో.. ఎవరా అని చూడగా..

ABN , First Publish Date - 2023-01-22T12:09:10+05:30 IST

ఓ మహిళ తన రెండేళ్ల కూతుర్ని ఎత్తుకుని రైలు ఎక్కేందుకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న ఆమెకు తెలిసిన టీటీఈ కనిపించాడు. అతనూ అదే రైల్లో డ్యూటీ చేస్తుండడంతో ఇక ఏం భయం లేదనుకుంది. అతడు చెప్పడంతో ఫ్రీగా ఏసీ బోగీలో కూర్చుంది. అయితే..

టీటీఈ చెప్పడంతో ఫ్రీగా ఏసీ బోగీలో కూర్చున్న మహిళ.. అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు దగ్గరికి రావడంతో.. ఎవరా అని చూడగా..
ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ తన రెండేళ్ల కూతుర్ని ఎత్తుకుని రైలు ఎక్కేందుకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న ఆమెకు తెలిసిన టీటీఈ కనిపించాడు. అతనూ అదే రైల్లో డ్యూటీ చేస్తుండడంతో ఇక ఏం భయం లేదనుకుంది. అతడు చెప్పడంతో ఫ్రీగా ఏసీ బోగీలో కూర్చుంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. బోగీలో లైట్లు ఆర్పేసిన కాసేపటికి ఇద్దరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చారు. దీంతో ఎవరా అని కంగారుగా చూసి.. చివరకు షాక్ అయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మద్యం మత్తులో రాత్రి వేళ ప్రియురాలి ఇంటికి వెళ్లిన యువకుడు.. కాసేపటి తర్వాత ఇంకో ఇద్దరు లోపలికి రావడంతో..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సంభాల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జవనరి 16న ఓ మహిళ (woman) తన రెండేళ్ల చిన్నారిని తీసుకుని చందౌసి రైల్వే స్టేషన్‌కు (Railway station) చేరుకుంది. డెహ్రాడూన్ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కోసం ప్లాట్‌ఫామ్‌పై వేచి చూస్తూ ఉంది. అదే సమయంలో రాజుసింగ్ అనే టీటీఈ (Travelling ticket examiner) అక్కడికి వచ్చాడు. మహిళ తనకు పరిచయం ఉండడంతో దగ్గరికి వెళ్లి మాట్లాడాడు. తానూ అదే రైల్లో డ్యూటీ చేస్తున్నానని చెప్పి మాటలు కలిపాడు. రైలు రాగానే ఆమెను ఏకంగా ఏసీ బోగీలో ఫ్రీగా కూర్చోబెట్టాడు. తెలిసిన వ్యక్తే కావడంతో ఆమె కూడా చెప్పినట్లే చేసింది.

తల్లి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న కొడుకు.. నిజామా, కాదా అని నిర్ధారించుకునే లోపే ఓ రోజు..

అయితే రాజ్‌ఘాట్, ఆలీఘర్ మధ్యలో అర్ధరాత్రి సమయంలో బోగీలో సదరు మహిళ వద్దకు వెళ్లాడు. లైట్లు ఆర్పేసి, ఆమెతో కాసేపు కబుర్లు చెప్పాడు. మాటల మధ్యలో టీటీఈకి తెలిసిన మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. కాసేపటికి తర్వాత ఇద్దరూ కలిసి మహిళపై అత్యాచారం చేశారు. దీంతో ఆమె భయపడి పక్క బోగీలో ఉన్న ప్రయాణికుల వద్ద కూర్చుంది. జనవరి 17 ఉదయం సుబేదర్‌గంజ్‌లో దిగి.. 20న రైల్వే కస్టమర్ కేర్ నంబర్‌కు (Railway Customer Care No) ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అనంతరం భర్తతో కలిసి చందౌసి జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. టీటీఈని అరెస్ట్ చేసిన, పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Viral Video: రైలు కదులుతుండగానే డోర్ తెరచి దిగేసిన వ్యక్తి.. చివరికి ఏమైందో చూడండి..

Updated Date - 2023-01-22T12:09:20+05:30 IST