తల్లి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న కొడుకు.. నిజామా, కాదా అని నిర్ధారించుకునే లోపే ఓ రోజు..

ABN , First Publish Date - 2023-01-21T21:04:56+05:30 IST

తన తల్లికి మరో యువకుడికి వివాహేతర సంబంధం ఉందని స్నేహితులు చెప్పడంతో కొడుకు షాక్ అయ్యాడు. ఆ వార్తను జీర్ణించుకోలేకపోయాడు. ఇది నిజామా, కాదా అని నిర్ధారించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఈలోపే..

తల్లి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న కొడుకు.. నిజామా, కాదా అని నిర్ధారించుకునే లోపే ఓ రోజు..
ప్రతీకాత్మక చిత్రం

తన తల్లికి మరో యువకుడికి వివాహేతర సంబంధం ఉందని స్నేహితులు చెప్పడంతో కొడుకు షాక్ అయ్యాడు. ఆ వార్తను జీర్ణించుకోలేకపోయాడు. ఇది నిజామా, కాదా అని నిర్ధారించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఈలోపే గ్రామస్తులంతా అదే విషయాన్ని మాట్లాడు్కుంటుండడంతో తీవ్ర అవమానంగా భావించాడు. చివరకు ఓ రోజు స్నేహితులతో కలిసి అతడు చేసిన పని.. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..

గర్భిణికి ఆపరేషన్ చేసి, పిండాన్ని పెంపుడు కుక్కకు తినిపించిన వైద్యులు.. 11 రోజుల తర్వాత చూస్తే..

uttar-pradesh-crime-news.jpg

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్పూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన పంకజ్ అనే వ్యక్తి ఇటీవల ఓ రోజు స్నేహితులతో కలిసి సరదాగా మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి పంకజ్ వద్దకు వచ్చి.. ‘‘ మీ అమ్మకు, దీపక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం (extramarital affair) ఉందని చెబుతున్నారు’’.. అని చెప్పాడు. దీంతో పంకజ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నిజమా, కాదా అని ఆలోచించుకునే లోపే.. ఓ రోజు గ్రామస్తులంతా ఇదే విషయాన్ని మాట్లాడుకోవడం విన్నాడు.

ప్రియుడితో కలిసి గదిలో ఉండగా ఇంట్లోకి వచ్చిన కొడుకు.. మీ నాన్నకు చెప్పొందంటూ.. చివరకు తల్లి చేసిన పని..

దీన్ని తీవ్ర అవమానంగా భావించిన పంకజ్.. తన స్నేహితుడు బదన్ సింగ్, మరికొంత మందితో కలిసి దీపక్‌ను హతమార్చేందుకు కుట్రపన్నారు. జనవరి 14న అంతా కలిసి దీపక్‌ను హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 6రోజుల తర్వాత పంకజ్, అతడి తల్లి, బదన్ సింగ్‌తో పాటూ మరికొందరిని అరెస్ట్ చేశారు. మృతుడికి, పంకజ్ తల్లికి మధ్య సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీపక్ హత్య విషయం అందరికీ తెలిసినా.. కావాలనే దాచి పెట్టారన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

ఓ యువకుడికి 20 రోజులుగా భరించలేని కడుపునొప్పి.. ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు తీసిన ఎక్స్‌రేలో ఏం కనిపించిందంటే..

Updated Date - 2023-01-21T21:05:03+05:30 IST