ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: చూసేందుకు రోడ్డు బానే ఉన్నా.. ఉన్నట్టుండి బైకర్లు మొత్తం ఎలా పడిపోతున్నారో చూడండి..

ABN, First Publish Date - 2023-03-26T19:30:09+05:30

కొందరు వాహనదారులకు రోడ్డు మీదకు రాగానే పూనకం వస్తుంటుంది. అధిక వేగంతో ప్రయాణిస్తూ చివరకు ప్రమాదాలకు గురవుతుంటారు. రోడ్డు బాగుంది కదా అని దూసుకుపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో అనుకోని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కొందరు వాహనదారులకు రోడ్డు మీదకు రాగానే పూనకం వస్తుంటుంది. అధిక వేగంతో ప్రయాణిస్తూ చివరకు ప్రమాదాలకు గురవుతుంటారు. రోడ్డు బాగుంది కదా అని దూసుకుపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో అనుకోని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు రోడ్లు చూసేందుకు బాగున్నా.. బురద, రాళ్లు తదితరాల కారణంగా వాహనాలు అదుపుతప్పుతుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చూసేందుకు రోడ్డు బాగున్నా.. బైకర్లు వరసగా కిందపడిపోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇంతకీ కారణం ఏంటంటే..

ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రాంతంలో మంచు (snow) కురుస్తూ ఉంటుంది. అక్కడి రోడ్డు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. మిగతా వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేదు గానీ.. బైకర్లు (Bikers) మాత్రం ఊహించని విధంగా జారి కిందపడిపోతున్నారు. ఓ వ్యక్తి స్కూటీలో వస్తూ సడన్‌గా (Bike accidents) జారి కిందపడతాడు. అలాగే పక్కనే మరి కొంతమంది బైకర్లు జారి కిందపడుతుంటారు. దీంతో మరికొంతమంది బైకర్లు.. తామూ ఎక్కడ కిందపడతామో అనే భయంతో నిదానంగా చూసుకుంటూ వెళ్తారు. ఆ ప్రాంతంలో మంచు కురవడం వల్ల రోడ్డుపై తేమ ఏర్పడింది. దీనివల్లే ఇలా జరిగిందని చివరకు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో సడన్‌గా బ్రేకులు వేయడం వల్ల కింద పడే ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట (social media) తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral news: టాటూ ఆర్టిస్టు వద్దకు వెళ్లిన ప్రియురాలు.. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కాసేపటికి ప్రియుడు వెళ్లి చూడగా..

Updated Date - 2023-03-26T19:30:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising