ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Longest Car: భలే కారు.. లోపల స్విమ్మింగ్ పూల్.. హెలికాఫ్టర్ దించేందుకు హెలీ ప్యాడ్..

ABN, First Publish Date - 2023-11-12T18:02:52+05:30

ఫైస్టార్ హోటల్‌లోని వసతులు ఉన్న అత్యంత పొడవైన కారు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: కారు అంటే సాధారణంగా నాలుగో, ఏడో సీట్లు ఉంటాయనుకుంటాం. కానీ, ఫైవ్ స్టార్ హోటల్ మాదిరిగా లోపల్ స్విమ్మింగ్ పూల్, గోల్ఫ్ కోర్స్, హెలికాఫ్ట్‌ర్ దిగేందుకు హెలీప్యాడ్ కూడా ఉంటుందంటే మీరేమంటారు? ఆశ్చర్యపోయారు కదూ! అవును, అలాంటి కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పేరుకే కారు కానీ రైలంత పొడవు వున్నట్టు కనిపించే ఈ కారు అత్యంత పొడవైనదిగా(Worlds longest car) గిన్నిస్ రికార్డ్స్‌లో(Guiness world records) కూడా స్థానం దక్కించుకుంది.

Shocking Video: చిన్న పిల్లాడిని ఎత్తుకుని పరుగులు తీసిన తండ్రి.. ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటుందనుకుంటే.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

Police vs Woman: హెల్మెట్ ఏదయ్యా..? నీ హెల్మెట్ ఏది..? అంటూ పోలీసును ఈ మహిళ ఎలా ఆటాడేసుకుందో మీరే చూడండి..!


ఈ కారుపేరు ‘అమెరికన్ డ్రీమ్’(American Dream). దీని పొడవు ఏకంగా 100 ఫీట్లు. సాధారణ కారు సగటు పొడవు 12 నుంచి 16 ఫీట్లు ఉంటుందంటే ఈ డ్రీమ్ కారు ఎంత పొడవో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ కారుకు సంబంధించిన వీడియోను subarna.mahanti.5 అనే ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో, కారు వివరాలు తెలుసుకుని జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఇందులో డైవింగ్ బోర్డుతో కూడిన స్విమ్మింగ్ పూల్, జకూజీ, బాత్‌టబ్, మినీ గోల్ఫ్ కోర్సు వంటివి ఉన్నాయి. అంతేకాదు, ఈ కారులో ఏకంగా 75 మంది ప్రయాణించవచ్చు.

Viral: బిడ్డకు ఆరోగ్యం బాలేదంటూ ఆసుపత్రికి వచ్చిన తండ్రి.. అతడి చేతుల్లో శిశువును చూసి వైద్యులు షాక్!


మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కారుపై హెలికాప్టర్ దింపేందుకు వీలుగా ఓ హెల్యీపాడ్ కూడా ఉంది. ఇది 5 వేల పౌండ్ల వరకూ బరువున్న హెలికాఫ్టర్‌ను మోయగలదు. ఆరు హోండా కార్లు ఒకదాని వెనుక మరొకటి పార్క్ చేసినంత పొడవు దీని సొంతం. దీంతో, ఈ కారును చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. అద్భుతంగా ఉందని కొందరు కామెంట్ చేశారు. భారతీయ నగరాల్లో దీన్ని నడిపితే వచ్చే అనుభవమే వేరు అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. నా బంగ్లాలో ఈ కారును పట్టేంత పార్కింగ్ స్థలం లేదు. లేకపోతే ఇలాంటి ఓ ఆరు ఏడు ఆర్డరిచ్చి ఉండేవాడిని అంటూ ఓ నెటిజన్ సరదా కామెంట్ చేశాడు.

Wife: నువ్వు చెప్పిందంతా అబద్ధం.. ఏం జరిగిందో నిజం చెప్పమంటూ చావుబతుకుల్లో ఉన్న భార్యను పోలీసులు నిలదీస్తే..!

Updated Date - 2023-11-12T18:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising