Share News

Viral: బిడ్డకు ఆరోగ్యం బాలేదంటూ ఆసుపత్రికి వచ్చిన తండ్రి.. అతడి చేతుల్లో శిశువును చూసి వైద్యులు షాక్!

ABN , First Publish Date - 2023-11-11T19:48:03+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ముజప్ఫర్‌నగర్ జిల్లా‌లో ఓ శిశువు నాలుగు కాళ్లు, మూడు చేతులతో జన్మించడం సంచలనంగా మారింది. వైద్యులే ఆ చిన్నారిని చూసి ఆశ్చర్యపోయారు.

Viral: బిడ్డకు ఆరోగ్యం బాలేదంటూ ఆసుపత్రికి వచ్చిన తండ్రి.. అతడి చేతుల్లో శిశువును చూసి వైద్యులు షాక్!

ఇంటర్నెట్ డెస్క్: తన బిడ్డకు ఒంట్లో బాలేదంటూ ఆసుపత్రికి వచ్చాడో వ్యక్తి. కానీ అతడి చేతుల్లో బిడ్డను చూసి వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ బిడ్డకు నాలుగు కాళ్లు, మూడు చేతులు ఉండటమే ఇందుకు కారణం(Child born with four legs and three hands). ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) ఈ ఘటన వెలుగు చూసింది.

Wife: నువ్వు చెప్పిందంతా అబద్ధం.. ఏం జరిగిందో నిజం చెప్పమంటూ చావుబతుకుల్లో ఉన్న భార్యను పోలీసులు నిలదీస్తే..!


ముజఫర్‌నగర్‌(Muzaffarnagar) జిల్లాకు చెందిన ఇర్ఫాన్..అనారోగ్యం పాలైన తన నవజాత శిశువును మీరట్‌లోని(Meerut) లాలా లజ్‌పత్ రాయ్ ఆసుపత్రిలో చేర్చించాడు. ఇర్ఫాన్‌కు పెళ్లై ఏడేళ్లు అవుతోంది. అప్పటికే అతడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇర్ఫాన్‌ భార్యకు ఇంట్లోనే పురుడుపోశారు. బిడ్డ ఆరోగ్యంగానే పుట్టినప్పటికీ నాలుగు కాళ్లు, మూడు చేతులతో ఉన్న శిశువును చూసి ఇంటిల్లపాదీ ఆశ్చర్యపోయారు. ఇటీవల చిన్నారి అనారోగ్యం పాలవడంతో తండ్రి ఆసుపత్రికి తీసుకొచ్చాడు.

Shocking Video: చిన్న పిల్లాడిని ఎత్తుకుని పరుగులు తీసిన తండ్రి.. ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటుందనుకుంటే.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

Police vs Woman: హెల్మెట్ ఏదయ్యా..? నీ హెల్మెట్ ఏది..? అంటూ పోలీసును ఈ మహిళ ఎలా ఆటాడేసుకుందో మీరే చూడండి..!


కాగా, ప్రస్తుతం వైద్యులు బిడ్డ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. చిన్నారి కూడా కోలుకుంటోందని తెలిపారు. అదనపు కాళ్లు, చేయితో బిడ్డ ఎందుకు జన్మించిందో తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, ఇదేమీ అద్భుత ఘటన కాదని వైద్యులు స్పష్టం చేశారు. పుట్టుకతో వచ్చే కొన్ని సమస్యల కారణంగా ఒక్కోసారి శిశువులు ఇలా అసాధారణ రూపంతో పుడతారని వివరించారు. కానీ, ఈ ఘటన మాత్రం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది.

Shocking: విమానాశ్రయంలో 23 ఏళ్ల కుర్రాడికి లైంగిక వేధింపులు.. వెనకున్న మహిళ చేష్టలతో విసిగిపోయానంటూ నెట్టింట పోస్ట్.. చివరకు..!

Updated Date - 2023-11-11T19:58:11+05:30 IST