Share News

Police vs Woman: హెల్మెట్ ఏదయ్యా..? నీ హెల్మెట్ ఏది..? అంటూ పోలీసును ఈ మహిళ ఎలా ఆటాడేసుకుందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-11-09T21:45:10+05:30 IST

హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళుతున్న ఓ పోలీసును మహిళ నిలదీసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Police vs Woman: హెల్మెట్ ఏదయ్యా..? నీ హెల్మెట్ ఏది..? అంటూ పోలీసును ఈ మహిళ ఎలా ఆటాడేసుకుందో మీరే చూడండి..!

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా వచ్చాక జనాల్లో కాస్తంత ధైర్యం పెరిగిందనే చెప్పాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ముందుగా వీడియో తీయడం, వెంటనే సోషల్ మీడియాలో పెట్టడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో కొందరు కట్టుతప్పుతున్న ప్రభుత్వాధికారులను కూడా పబ్లిక్‌గా నిలదీస్తున్నారు. అయితే, నిబంధనలను అతిక్రమించిన ఓ పోలీసును ఇలాగే నిలదీసిన మహిళపై ప్రశంసలకు బదులు విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతున్న ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే,

Vivek Ramaswamy: నువ్వో చెత్త, నా కూతురి పేరెత్తొద్దు..వివేక్ రామస్వామిపై విరుచుకుపడ్డ అమెరికన్ నేత

Join My Wedding: మనోళ్ల పెళ్లిళ్లకు విదేశీయులు డబ్బులు చెల్లించి మరీ గెస్టులుగా వస్తే.. ఐడియా అదుర్స్ కదూ..!


ముంబైలో ఇటీవల కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు హెల్మెట్ లేకుండా బైక్ నడుపున్న ఓ పోలీసు కనిపించారు. మామూలుగా అయితే మనకెందులే అని వెళ్లిపోవాల్సిన మహిళ అనూహ్యంగా కారులోంచే అతడివైపు బిగ్గరగా అరుస్తూ హెల్మెట్ ప్రస్తావన తెచ్చింది. హెల్మెట్ ఏదయ్యా..? నీ హెల్మెట్ ఏది..? అంటూ బిగ్గరగా ప్రశ్నించింది(Woman calls out cop for not wearing helmet). ఈ క్రమంలో పోలీసు కాస్తంత సీరియస్ అయినట్టు కనిపించినా ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు. హెల్మెట్..హెల్మెట్ అంటూ బిగ్గరగా ప్రశ్నించింది. దీంతో, ఆ పోలీసే సైలెంట్‌గా వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ ఉదంతాన్ని కారులోని మరో మహిళ రికార్డు చేసింది.

NRI: గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట


ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారడంతో జనాలు మహిళ ధైర్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు మాత్రం కారు డ్రైవ్ చేస్తున్న మరో మహిళ తన సీట్ బెల్టు పెట్టుకోని విషయాన్ని గుర్తించారు. తాము నిబంధనలు పాటించకుండా మరొకరిని ప్రశ్నించడం ఏంటని ప్రశ్నించారు. పోలీసును ఆమె ‘నువ్వు’ అంటూ సంబోధించడం కూడా కొందరికి నచ్చలేదు. ‘మీరు’ అంటూ గౌరవప్రదంగా పిలిస్తే పోయేదేముందంటూ పెదవివిరిచారు. కాగా, ఘటనపై స్పందించిన ముంబై పోలీసుల(Mumbai Police) ఈ ఉదంతం ఎక్కడ జరిగిందో చెబితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Woman Constable: ఈ ఫొటోలోని కానిస్టేబుల్ ఉద్యోగం ఊస్ట్.. తెలియక ఆమె చేసిన ఒక్క మిస్టేక్‌తో పోలీస్ శాఖలో హాట్ టాపిక్..!

Updated Date - 2023-11-09T21:45:14+05:30 IST