Viral Video: కంగారూ దాడి నుంచి ఓ మహిళను కాపాడాడు.. తాను మాత్రం దొరికిపోయాడు.. వైరల్ అవుతున్న వీడియో!
ABN, First Publish Date - 2023-06-17T16:44:30+05:30
ఆస్ట్రేలియా దేశం కంగారూలకు ప్రసిద్ధి. కేవలం వాటిని చూసేందుకే చాలా మంది పర్యాటకులు ఆస్ట్రేలియాకు వెళ్తుంటారు. కంగరూలు ఎప్పుడూ మనుషుల జోలికి రావు. వాటి పని అవి చూసుకునే సాధు జంతువులనే పేరుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆ అభిప్రాయాన్ని కాస్తా మార్చుకోవాల్సిందే.
ఆస్ట్రేలియా (Australia) దేశం కంగారూల (Kangaroo)కు ప్రసిద్ధి. కేవలం వాటిని చూసేందుకే చాలా మంది పర్యాటకులు ఆస్ట్రేలియాకు వెళ్తుంటారు. కంగరూలు ఎప్పుడూ మనుషుల జోలికి రావు. వాటి పని అవి చూసుకునే సాధు జంతువులనే పేరుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే ఆ అభిప్రాయాన్ని కాస్తా మార్చుకోవాల్సిందే. ఈ వీడియోలోని ఓ కంగరూ ఓ వ్యక్తితో ఫైటింగ్‌కు దిగింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ జంతుప్రదర్శనశాలలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Kangaroo Video).
@ZeusKingOfTwitt అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన వీడియోలో ఓ మహిళ జూ (Zoo)లో నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెను ఓ కంగారూ వెంబడించింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఆ కంగరూను అడ్డుకుని ఆ మహిళను రక్షించాడు. దీంతో ఆ కంగారూ అతడితో ఫైటింగ్‌కు దిగింది. కంగారూను అతడు దూరంగా నెట్టెయ్యడానికి ప్రయత్నించాడు. అయితే ఆ కంగారూ మాత్రం అతడి మీదకు దూకడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత దాని మెడను పెట్టుకుని వెనక్కి తీసుకెళ్లాడు. అయినా ఆ కంగారూ జంకలేదు. అతడిని వదల్లేదు (Kangaroo Fighting).
Marriage: వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ పెళ్లిలో వధువుకు పరిచయం చేసిన వరుడు.. 12 ఏళ్ల తర్వాత అతడితోనే ఆమెకు మళ్లీ పెళ్లి..!
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలోని వ్యక్తిని అమెరికాకు చెందిన పర్యాటకుడిగా గుర్తించారు. ఎవరైనా రెచ్చగొడితే తప్ప కంగారూలు చాలా ప్రశాంతంగా ఉంటాయని జూ సిబ్బంది చెబుతున్నారు. వాటికి కోపం వస్తే మాత్రం ధైర్యంగా పోరాడతాయని, వెనక కాళ్ల మీద నిలబడి పంజా విసురుతాయని తెలిపారు. అలాగే శరీర బరువు మొత్తాన్ని తోక మీద వేసి కూడా పోరాడతాయని చెప్పారు.
Updated Date - 2023-06-17T16:44:30+05:30 IST