Marriage: వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ పెళ్లిలో వధువుకు పరిచయం చేసిన వరుడు.. 12 ఏళ్ల తర్వాత అతడితోనే ఆమెకు మళ్లీ పెళ్లి..!
ABN , First Publish Date - 2023-06-17T16:07:59+05:30 IST
కొన్ని సార్లు జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళకు అలాంటి సందర్భమే ఎదురైంది. 12 ఏళ్ల క్రితం తన భర్త బెస్ట్ ఫ్రెండ్‌గా వివాహానికి వచ్చిన వ్యక్తినే ఆ మహిళ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వారి లవ్‌స్టోరీ విన్న చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని సార్లు జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. బ్రిటన్ (Britain)కు చెందిన ఓ మహిళకు అలాంటి సందర్భమే ఎదురైంది. 12 ఏళ్ల క్రితం తన భర్త బెస్ట్ ఫ్రెండ్‌గా వివాహానికి వచ్చిన వ్యక్తినే ఆ మహిళ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వారి లవ్‌స్టోరీ (Love Story) విన్న చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లండన్‌కు చెందిన కెర్రీ స్విన్‌టన్‌కు 2011లో వివాహం జరిగింది. ఆ వివాహాని (Wedding)కి మార్క్ టేలర్ అనే వ్యక్తి హాజరయ్యాడు. కెర్రీ భర్తకు మార్క్ బెస్ట్ ఫ్రెండ్.
వివాహం తర్వాత అప్పుడప్పుడు తన స్నేహితుడి కోసం కెర్రీ ఇంటికి మార్క్ వెళ్లేవాడు. అయితే కెర్రీ తన మొదటి భర్తతో మూడేళ్లు మాత్రమే కలిసి జీవించింది. ఒక పాప పుట్టాక ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. దాంతో కెర్రీకి మార్క్ కూడా దూరమయ్యాడు. కొద్ది రోజుల తర్వాత కెర్రీ ఓ పియానో కొనుగోలు చేసింది. దానిని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కోసం వెతుకుతుండగా మార్క్ తిరిగి కలిశాడు. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు తనతో డేటింగ్‌కు రావాల్సిందిగా కెర్రీని మార్క్ ఆహ్వానించాడు.
Shocking Video: వామ్మో.. ఆకాశంలో ఉండగానే తెరుచుకున్న విమానం డోర్.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం!
అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ కొద్దికాలం డేటింగ్ చేశారు. 2021లో టేలర్‌కు కిడ్నీ సమస్య ఉన్నట్టు బయటపడింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయకపోతే టేలర్ బతకడం కష్టం అని డాక్టర్లు తేల్చారు. దీంతో కెర్రీ తన కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కెర్రీ కిడ్నీ మ్యాచ్ కావడంతో డాక్టర్లు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. ప్రస్తుతం మార్క్ ఆరోగ్యంగా ఉన్నారు. కెర్రీ, మార్క్ తాజాగా వివాహం కూడా చేసుకుని ఒక్కటయ్యారు.