Viral Video: ఇది నిజంగా అద్భుతమే.. చెట్టు నుంచి సంగీతం ఎలా వచ్చిందో చూడండి.. వీడియో వైరల్!
ABN, Publish Date - Dec 17 , 2023 | 06:41 PM
సంగీతానికి ఎంతో శక్తి ఉందని మనం తరచుగా వింటూ ఉంటాం. సంగీతం వినిపిస్తే చెట్లు బాగా ఎదుగుతాయని కొన్ని రోజుల కిందట ఓ అధ్యయనం కూడా వెలువడింది. అయితే చెట్ల కొమ్మల నుంచి సంగీత తరంగాలు బయటకు వస్తాయంటే మీరు నమ్ముతారా?
సంగీతానికి (Music) ఎంతో శక్తి ఉందని మనం తరచుగా వింటూ ఉంటాం. సంగీతం వినిపిస్తే చెట్లు (Tree) బాగా ఎదుగుతాయని కొన్ని రోజుల కిందట ఓ అధ్యయనం కూడా వెలువడింది. అయితే చెట్ల కొమ్మల నుంచి సంగీత తరంగాలు బయటకు వస్తాయంటే మీరు నమ్ముతారా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే నమ్మక తప్పదు. తాజాగా బెంగళూరులోని (Bengaluru) ఓ భారీ వృక్షం కింద కచేరీ జరిగింది. ప్రకృతికి దగ్గరగా ఓ భారీ చెట్టు చుట్టూ స్టేజ్ వేసి డీజే ఏర్పాటు చేశారు (DJ with Tree).
భారతీయ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడైన కెనడియన్ తరుణ్ నాయర్ (Tarun Nair) ఈ అద్భుతమైన కచేరీ చేశాడు. తన సంగీత పరికరాలను చెట్టుకు అనుసంధానం చేసి సంగీతాన్ని సృష్టించాడు. చెట్టు నుంచి వచ్చిన ఆ ధ్వని చాలా మందిని ఆకట్టుకుంది. ఆ కచేరికి చాలా మంది శ్రోతలు హాజరయ్యారు. దానికి సంబంధించిన వీడియోను taruntspoon అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. 3.4 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది నిజంగా అద్బుతమే``, ``ప్రకృతితో మమేకమైన సంగీతం``, ``సంగీతానికి ఎల్లలు లేవు``, ``మరపురాని అనుభూతి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - Dec 17 , 2023 | 06:41 PM