Snake With Four Legs: ఇదేం వింత బాబోయ్.. పాముకు కాళ్లు ఉండటాన్ని మీరెక్కడైనా చూశారా..? అసలు ఇది పామేనా..?
ABN, First Publish Date - 2023-06-13T16:30:37+05:30
ఈ విశాల విశ్వంలో మానవునికి అంతు బట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా, అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించినా ప్రకృతి రహస్యాలను పూర్తిగా ఛేదించడం మానవులకు సాధ్యపడలేదు. తాజాగా నాలుగు కాళ్లతో ఉన్న వింత పాము శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
ఈ విశాల విశ్వంలో మానవునికి అంతు బట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా, అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించినా ప్రకృతి రహస్యాలను (Nature Wonders) పూర్తిగా ఛేదించడం మానవులకు సాధ్యపడలేదు. ఈ భూమి మీద మనుష్యులతో పాటు ఎన్నో లక్షల జంతుజాతులు నివసిస్తున్నాయి. వాటిల్లో మనుషులకు చాలా కొద్ది వాటి గురించి మాత్రమే తెలుసు. తాజాగా నాలుగు కాళ్లతో ఉన్న వింత పాము (Four Legged Snake) శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
కొంతమంది దీనిని కొత్త జాతి పాము అని పిలుస్తుండగా, మరికొందరు దీనిని పొడవాటి తోక కలిగిన బల్లి (Lizard) అని అంటున్నారు. ఆ జీవి ముందు భాగం బల్లిలా కనిపిస్తుండగా, వెనుక భాగం చూస్తే పాములా అనిపిస్తోంది. లక్షల సంవత్సరాల క్రితం ఇలాంటి పాము ఒకటి ఉండేదని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ జీవి చిన్న చిన్న కీటకాలను తింటూ బతుకుతుంది. దీని వేట పద్ధతి బల్లితో సరిపోతుంది. ఈ నాలుగు కాళ్ల పాము నిజానికి పాము కాకపోవచ్చునని అల్బెర్టా యూనివర్సిటీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
Bike Stunt Fail: ఒంటికి నిప్పంటించుకుని బైక్‌తో సహా నీళ్లలో పడాలన్నది ప్లాన్.. కానీ జరగకూడనిదే జరిగింది..!
మిలియన్ల సంవత్సరాల క్రితం అప్పటి శాస్త్రవేత్తలు దీనిని పాముగా వర్గీకరించినప్పటికీ, అది తప్పని ఇప్పటి పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ జీవి తన కాళ్ల సహాయంతో గోడపైకి ఎక్కుతుంది. కాగా, పూర్వం పాములకు కాళ్లు ఉండేవని, కాలక్రమేణా అవి కనుమరుగైపోయాయనే సిద్ధాంతం కూడా ఉంది. మిలియన్ల సంవత్సరాల నాటి శిలాజాలలో పాము పాదముద్రలు గతంలో బయటపడినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ వింత పాము జనాలను ఆశ్చర్యపరుస్తోంది.
Updated Date - 2023-06-13T16:30:37+05:30 IST