Bike Stunt Fail: ఒంటికి నిప్పంటించుకుని బైక్‌తో సహా నీళ్లలో పడాలన్నది ప్లాన్.. కానీ జరగకూడనిదే జరిగింది..!
ABN , First Publish Date - 2023-06-13T15:53:39+05:30 IST
బైక్ స్టంట్లు చేసే వాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతారు. ఒక్కోసారి తీవ్రంగా గాయపడుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ బైకర్ చేసిన స్టంట్ దారుణంగా ఫెయిల్ అయింది.
బైక్ స్టంట్లు (Bike Stunts) చేసే వాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతారు. ఒక్కోసారి తీవ్రంగా గాయపడుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ బైకర్ చేసిన స్టంట్ దారుణంగా ఫెయిల్ (Bike Stunt Fail) అయింది. దీంతో ఆ బైకర్ గాయాలపాలయ్యాడు. ఆ వీడియో చూడడానికే చాలా భయానకంగా ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ (Viral Video) చేస్తోంది.
@clipsthatgohard అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో, ఒక బైకర్ తన దుస్తులకు నిప్పంటించి (Fire) బైక్ స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. అతను అధిక వేగంతో లాంచ్ ప్యాడ్ నుంచి గాల్లోకి దూకాడు. అయితే లాంచ్ ప్యాడ్ నుంచి దూకగానే బ్యాలెన్స్ కోల్పోయి బైక్‌పై పట్టు కోల్పోయాడు. ఆ మంటలతో పాటు పక్కనే ఉన్న నీటి కొలనులో దూకాలనేది బైకర్ ప్లాన్. అయితే స్టంట్ ఫెయిల్ కావడంతో అతడు చాలా దూరం వెళ్లిపోయి నేలపై పడిపోయాడు.
Viral News: ఫుల్ బాటిల్ ఖాళీ చేసి మొత్తం మర్చిపోయాడు.. దొంగ చేతికి తాళాలిచ్చాడు.. ఉదయం లేచి చూసేసరికి..
అతడి దుస్తులకు పూర్తిగా మంటలు అంటుకున్నాయి. అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 32 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అతడికి ఏమైందని ఆరాలు తీస్తున్నారు.