Viral News: ఫుల్ బాటిల్ ఖాళీ చేసి మొత్తం మర్చిపోయాడు.. దొంగ చేతికి తాళాలిచ్చాడు.. ఉదయం లేచి చూసేసరికి..

ABN , First Publish Date - 2023-06-12T20:39:00+05:30 IST

మద్యం సేవించిన వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. చుట్టుపక్కల ఏం జరుగుతోందో పట్టించుకోనంతగా తాగేసే వ్యక్తులు తమ గురించి కూడా మర్చిపోతుంటారు. తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తికి అలాంటి సందర్భమే ఎదురైంది. మద్యం సేవించి అతడేం చేశాడో తెలుసుకుంటే నవ్వు రావడం ఖాయం.

Viral News: ఫుల్ బాటిల్ ఖాళీ చేసి మొత్తం మర్చిపోయాడు.. దొంగ చేతికి తాళాలిచ్చాడు.. ఉదయం లేచి చూసేసరికి..

మద్యం (Alcohol) సేవించిన వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. చుట్టుపక్కల ఏం జరుగుతోందో పట్టించుకోనంతగా తాగేసే వ్యక్తులు తమ గురించి కూడా మర్చిపోతుంటారు. తాజాగా గురుగ్రామ్‌ (Gurugram)కు చెందిన ఓ వ్యక్తికి అలాంటి సందర్భమే ఎదురైంది. మద్యం సేవించి అతడేం చేశాడో తెలుసుకుంటే నవ్వు రావడం ఖాయం. హర్యానా (Haryana)లోని గురుగ్రామ్‌కు చెందిన అమిత్ ప్రకాష్(30) అనే వ్యక్తి బార్‌కు వెళ్లి ఫుల్‌గా మద్యం సేవించాడు. బార్ మూసేశాక బయటకు వచ్చాడు. అయినా అతడికి ఆ డోసు సరిపోలేదు.

కారులో తాగడం కోసం వైన్ షాప్ దగ్గరకు వెళ్లి ఆల్కహాల్ బాటిల్ కొనుకున్నాడు. ఆ తర్వాత తన కారు దగ్గరికెళ్లి తాగడం మొదలుపెట్టాడు. ఇంతలో ఓ అపరిచిత వ్యక్తి అక్కడికి వచ్చాడు. నేను కూడా తాగొచ్చా అని అతడు అడగడంతో ప్రకాష్ అతనికి కూడా మద్యం ఇచ్చాడు. ఇద్దరూ ఫుల్‌గా మద్యం సేవించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కారులో సుభాష్ చౌక్ వరకు వెళ్లారు. కారును అపరిచిత వ్యక్తి డ్రైవ్ చేశాడు. సుభాష్ చౌక్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఆ అపరిచిత వ్యక్తి ప్రకాష్‌ను కారు దిగమన్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ప్రకాష్ కారు తనది కాదేమో అనుకుని దిగేసి వెళ్లిపోయాడు (Drunken man gave his car to stranger).

Viral News: బాబోయ్.. ఇదెక్కడి వింత..? రోడ్డు మరీ ఇంతలా కుంగిపోయిందేంటి..? అసలు ఇదెక్కడ జరిగిందంటే..!

ఎలాగోలా ఇంటికి చేరుకుని నిద్రపోయాడు. తర్వాత రోజు ఉదయం మత్తు దిగిన తర్వాత అసలు విషయం గుర్తుకొచ్చి షాక్ తిన్నాడు. తాగిన మైకంలో కారును అపరిచిత వ్యక్తికి అప్పగించినట్టు తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ రాత్రి ఏం జరిగిందో మొత్తం వివరించాడు. కారుతో పాటు అందులో రూ.18 వేల నగదు, మొబైల్, ల్యాప్‌టాప్ ఉన్నట్టు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2023-06-12T20:39:00+05:30 IST