Viral News: బాబోయ్.. ఇదెక్కడి వింత..? రోడ్డు మరీ ఇంతలా కుంగిపోయిందేంటి..? అసలు ఇదెక్కడ జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-06-12T19:17:47+05:30 IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. కాంట్రాక్టర్‌ల అవినీతి, ప్రభుత్వాల ఉదాసీనతల కారణంగా రాహదారులు ప్రత్యక్ష నరకాలుగా మారుతున్నాయి. తాజాగా బీహార్‌లోని ఓ ప్రధాన రహదారిపై వెళ్తున్న ట్రక్కు వెనుక చక్రం రోడ్డులో కూరుకుపోయింది.

Viral News: బాబోయ్.. ఇదెక్కడి వింత..? రోడ్డు మరీ ఇంతలా కుంగిపోయిందేంటి..? అసలు ఇదెక్కడ జరిగిందంటే..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో రహదారుల (Roads) పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. కాంట్రాక్టర్‌ల అవినీతి, ప్రభుత్వాల ఉదాసీనతల కారణంగా రాహదారులు ప్రత్యక్ష నరకాలుగా మారుతున్నాయి. తాజాగా బీహార్‌ (Bihar)లోని ఓ ప్రధాన రహదారిపై వెళ్తున్న ట్రక్కు వెనుక చక్రం రోడ్డులో కూరుకుపోయింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ (Viral Photo)గా మారింది.

పాట్నా నగరంలోని అగంకువాన్-శీతల మాత మందిర్ రహదారికి సమీపంలో ప్రయాణిస్తున్న కంటైనర్ వెనుక చక్రం రోడ్డులో కూరుకుపోయింది (Truck got stuck in a road). ట్రక్కు రోడ్డులో కూరుకుపోయిన ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Viral News: ప్రధాని మోదీ నుంచి.. సీఎం వరకు.. అందరి సాయాన్ని కోరిన ఈ యువతి ఎవరు..? తండ్రి దారుణాన్ని బయటపెట్టి..!

రోడ్ల దుస్థితిని చూసి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు వ్యంగ్య కామెంట్లు చేశారు. ``రోడ్డు మరీ అంత సాఫ్ట్‌గా ఉంటే ఎలా``, ``గొప్ప అభివృద్ధి.. బీహార్ అంతటా ఇలాంటి రక్కసి రోడ్లు ఉన్నాయి`` అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు తమ ప్రాంతంలో ఉన్న రోడ్లకు సంబంధించిన ఫొటోలను తీసి పోస్ట్ చేశారు. తమకు సంక్షేమ పథకాలు వద్దని, అభివృద్ధి ఫలాలు కావాలని మరికొందరు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-06-12T19:17:47+05:30 IST