Viral News: ప్రధాని మోదీ నుంచి.. సీఎం వరకు.. అందరి సాయాన్ని కోరిన ఈ యువతి ఎవరు..? తండ్రి దారుణాన్ని బయటపెట్టి..!

ABN , First Publish Date - 2023-06-12T18:57:24+05:30 IST

ఆ యువతి చిన్ననాటి తన స్నేహితుడిని ప్రేమించింది.. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది.. అందుకు తండ్రి అంగీకరించలేదు.. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కోరుకున్న వాడినే పెళ్లి చేసుకుంది.. అన్ని విషయాలు తెలిసినా తండ్రి పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు.. దీంతో పోలీసులు ఆ యువతిని పట్టుకుని తండ్రికి అప్పగించారు..

Viral News: ప్రధాని మోదీ నుంచి.. సీఎం వరకు.. అందరి సాయాన్ని కోరిన ఈ యువతి ఎవరు..? తండ్రి దారుణాన్ని బయటపెట్టి..!

ఆ యువతి చిన్ననాటి తన స్నేహితుడిని ప్రేమించింది.. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది.. అందుకు తండ్రి అంగీకరించలేదు.. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కోరుకున్న వాడినే పెళ్లి చేసుకుంది (Love Marriage).. అన్ని విషయాలు తెలిసినా తండ్రి పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు.. దీంతో పోలీసులు ఆ యువతిని పట్టుకుని తండ్రికి అప్పగించారు.. అప్పట్నుంచి ఆ తండ్రి తన కన్న కూతురికే నరకం చూపించాడు.. చివరకు ఆ యువతి తన తండ్రి నుంచి రక్షించమని కోరుతూ ప్రధాని మోదీకి (PM Modi), రాష్ట్ర ముఖ్యమంత్రికి సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తులు చేసింది (Crime News).

రాజస్థాన్‌ (Rajasthan)లోని జోధ్‌పూర్‌కు చెందిన తాన్యా శర్మ అనే యువతి తన చిన్న నాటి స్నేహితుడు సురేంద్ర సంఖ్లాను ఈ ఏడాది జనవరిలో ప్రేమ వివాహం చేసుకుంది. తాన్య తండ్రి ఈ వివాహానికి వ్యతిరేకం. కూతురు మరో పెళ్లి చేసుకుందని తెలిసినా అతడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. బాలేసర్ పోలీసులు తాన్య శర్మను పట్టుకుని తండ్రికి అప్పగించారు. ఆ తర్వాత నుంచి తాన్య తన తండ్రి చెరలోనే బందీగా ఉంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలకు తిప్పుతూ తండ్రి ఆమెను వేధించాడు. అంతేకాదు జితేంద్ర జోషి అనే యువకుడితో మే1వ తేదీన బలవంతంగా వివాహం జరిపించాడు.

Marriage: రెండ్రోజుల్లో పెళ్లనగా సడన్‌గా చనిపోయిన 75 ఏళ్ల బామ్మ.. వివాహం ఆగిపోకూడదని ఆ మనవడు ఎంతకు తెగించాడంటే..!

మనసు మారేవరకు ఆమెను బంధించి చిత్రహింసలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. తీవ్ర గాయాల పాలైన ఆమెను రాయ్‌పూర్‌లోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆ సమయంలో ఆమె ఓ వ్యక్తి నుంచి మొబైల్ తీసుకుని తన భర్తకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, నటుడు సోనూ సూద్‌లను ట్యాగ్ చేస్తూ తన పరిస్థితిని వివరిస్తూ ట్వీట్లు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను తండ్రి చెర నుంచి విడిపించి భర్తకు అప్పగించారు. ఆమె తండ్రి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Updated Date - 2023-06-12T18:57:24+05:30 IST