Marriage: రెండ్రోజుల్లో పెళ్లనగా సడన్‌గా చనిపోయిన 75 ఏళ్ల బామ్మ.. వివాహం ఆగిపోకూడదని ఆ మనవడు ఎంతకు తెగించాడంటే..!
ABN , First Publish Date - 2023-06-12T17:01:19+05:30 IST
ఆ యువకుడికి పెళ్లి కుదిరింది..పెళ్లికి కుటుంబం మొత్తం కలిసి ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేసింది.. వివాహానికి మూడ్రోజుల ముందు ఆ యువకుడి నాయనమ్మ తీవ్ర అస్వస్థతకు గురైంది.. వెంటనే ఆమెను హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందించారు.. అయితే ఆమె హాస్పిటల్‌లో మరణించింది..
ఆ యువకుడికి పెళ్లి (Marriage) కుదిరింది..పెళ్లికి కుటుంబం మొత్తం కలిసి ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేసింది.. వివాహానికి మూడ్రోజుల ముందు ఆ యువకుడి నాయనమ్మ (Grand Mother) తీవ్ర అస్వస్థతకు గురైంది.. వెంటనే ఆమెను హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందించారు.. అయితే ఆమె హాస్పిటల్‌లో మరణించింది.. ఆమె చనిపోయినట్టు తెలిస్తే పెళ్లి ఆగిపోతుందని భయపడిన వరుడు నాయనమ్మ డెడ్ బాడీనీ హాస్పిటల్‌లోని ఫ్రీజర్ (Freezer)లో వదిలేశాడు.. కుటుంబ సభ్యులు కూడా వరుడి నిర్ణయానికి మద్దతుగా నిలిచారు.. చివరకు అసలు విషయం బయటపడడంతో పెళ్లి వాయిదా పడింది.
ముజఫర్‌నగర్ (Muzaffarnagar)లోని సిసౌలీకి చెందిన నరేంద్ర గుప్తా కుమారుడు గౌరవ్ గుప్తాకి వివాహం నిశ్చయమైంది. ఈ నెల 11వ తేదీన వివాహ ముహూర్తం నిర్ణయించారు. అయితే నరేంద్ర గుప్తా 75 ఏళ్ల తల్లి కమల అనారోగ్యానికి గురి కావడంతో శుక్రవారం ఆమెను ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ కమల శనివారం మృతి చెందింది. గౌరవ్ గుప్తా తన వివాహాన్ని దృష్టిలో ఉంచుకుని, నాయనమ్మ అంత్యక్రియలను వాయిదా వేశాడు. ఆమె మృతదేహాన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని డీప్ ఫ్రీజర్‌లో ఉంచాడు.
Viral News: ఈ రేకుల ఇల్లు ఎవరిదో కానీ.. నెట్టింట హాట్ టాపిక్ అయిన సంగతి కూడా తెలిసి ఉండదు.. ఎందుకింత చర్చ అంటే..!
ఎవరికీ విషయం చెప్పకుండా పెళ్లి వేడుకకు సిద్ధమయ్యాడు. గౌరవ్ కుటుంబ సభ్యులు కూడా అతడికి వత్తాసు పలికారు. అయితే వేరే ఊరిలో ఉంటున్న నరేంద్ర గుప్తా సోదరుడు శశి భూషణ్‌కు విషయం తెలిసిపోయింది. అతడు వెంటనే హాస్పిటల్‌కు చేరుకుని తల్లి మృతదేహాన్ని స్మశానానికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. దీంతో అందరికీ విషయం తెలిసిపోయింది. పెళ్లి కోసం ఇంటి పెద్ద మృతదేహాన్ని హాస్పిటల్‌లో వదిలేసిన గౌరవ్ గుప్తా కుటుంబంపై అందరూ విమర్శలు చేస్తున్నారు. కాగా, ఆదివారం జరగాల్సిన వివాహం ఆగిపోయింది.