Viral News: ఈ రేకుల ఇల్లు ఎవరిదో కానీ.. నెట్టింట హాట్ టాపిక్ అయిన సంగతి కూడా తెలిసి ఉండదు.. ఎందుకింత చర్చ అంటే..!
ABN , First Publish Date - 2023-06-12T16:43:28+05:30 IST
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల ఉష్ణోగ్రత దాదాపు 45 డిగ్రీల పైగానే నమోదవుతోంది. ఈ ఎండలను తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఉడికించే వేడిలో నిద్రపోవడానికి ఆపసోపాలు పడుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు (Summer) మండిపోతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల ఉష్ణోగ్రత దాదాపు 45 డిగ్రీల పైగానే నమోదవుతోంది. ఈ ఎండలను తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఉడికించే వేడిలో నిద్రపోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. వీలైతే ఏసీ (AC)లు కొనుక్కుని ఇళ్లకు బిగించుకుంటున్నారు. తాజాగా ముంబై (Mumbai)లో ఓ రేకుల షెడ్డు (Chawl House)కు కూడా ఏసీ బిగించి ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ముంబై మహానగరంలో ఆకాశాన్ని తాకే భవనాలే కాదు.. మురికి వాడలు కూడా విపరీతంగా ఉంటాయి. చాలా మంది రేకుల షెడ్లలోనే నివసిస్తారు. రేకుల షెడ్ల కింద వేసవిలో ఉండడమంటే పొయ్యి మీద కూర్చున్నట్టే ఉంటుంది. అందుకే కొందరు తాము నివసించే రేకుల షెడ్డుకే ఏసీలు బిగించుకుంటున్నారు. తాజాగా అలాంటి ఇంటికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఇంటిని చూస్తుంటే కనీసం ఆ ఇంటికి నీటి సౌకర్యం కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. కానీ, ఏసీ మాత్రం ఉంది (AC installed in a chawl house).
Viral Video: రూపాయి ఖర్చు లేకుండా పాలల్లో నీళ్లు కలిపారో.. లేదో.. ఈజీగా తెలుసుకునే చిట్కాలివీ.. ఓ చిన్న అద్దంతో..!
@GabbbarSingh అనే ట్విటర్ యూజర్ చేసిన ఈ పోస్ట్‌ను దాదాపు 8.2 లక్షల మంది చూశారు. ఈ ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``మంచి నీటి కంటే చల్లని వాతావరణం అత్యవసరం``, ``ఇలాంటి ప్రాంతాల్లో నివసించే వారు పగలంతా ఎండలో కష్టపడి పని చేస్తారు. కనీసం రాత్రైనా చల్లగా నిద్రపోవాలనుకుంటారు``, ``నా దేశం మారిపోతోంది``, ``ఇప్పటి ప్రజల కనీస అవసరాల్లో ఏసీ కూడా చేరిపోయింది`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.