Viral Video: రూపాయి ఖర్చు లేకుండా పాలల్లో నీళ్లు కలిపారో.. లేదో.. ఈజీగా తెలుసుకునే చిట్కాలివీ.. ఓ చిన్న అద్దంతో..!
ABN , First Publish Date - 2023-06-12T16:14:45+05:30 IST
మనిషి పుట్టినప్పటి నుంచి చివరి వరకు అన్ని దశల్లోనూ పాలు, పాల ఉత్పత్తులను ఆహారంగా తీసుకోకతప్పదు. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరం ఎదుగుదలకు, అభివృద్ధికి పాలు అవసరం. పాల నుంచే మన శరీరానికి కాల్షియం, ప్రోటీన్‌తో సహా అనేక పోషకాలు లభిస్తాయి.
మనిషి పుట్టినప్పటి నుంచి చివరి వరకు అన్ని దశల్లోనూ పాలు (Milk), పాల ఉత్పత్తులను ఆహారంగా తీసుకోకతప్పదు. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరం ఎదుగుదలకు, అభివృద్ధికి పాలు అవసరం. పాల నుంచే మన శరీరానికి కాల్షియం, ప్రోటీన్ (Protein)తో సహా అనేక పోషకాలు లభిస్తాయి. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో లభించే పాల గురించిన నిజాలు తెలుసుకుంటే మాత్రం ఆందోళన చెందక తప్పదు. పాల కల్తీ గురించి తరచుగా మనం వార్తలు వింటూనే ఉంటాం.
పాల దుకాణంలో పాలు కొనేవారి సంగతి పక్కన పెడితే ఇంటికి వచ్చి పాలు పోసే వారు మరింతగా పాలను కల్తీ చేస్తారు (Milk Adulteration). పాలలో దాదాపు పావు భాగం నీరు కలిపి పోసేస్తారు. అలాంటి పాలు తాగడం వల్ల శరీరానికి తగినంత పోషకాలు అందవు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పాలు స్వచ్ఛతను తనిఖీ చేసే విధానాన్ని వివరించింది. పాల స్వచ్ఛతను ఎలా తెలుసుకోవచ్చో సూచిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది (Water in Milk). అలాగే కొందరు పాలలో ప్రమాదక డిటర్జెంట్ (Detergent in Milk) కూడా వేసి కల్తీ చేస్తుంటారు. మీ పాలలో డిటర్జెంట్ కలిసిందో లేదో కూడా పరీక్షించే వీడియోను FSSAI పంచుకుంది.
Anand Mahindra: ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియోను చూసి ఉలిక్కిపడుతున్న నెటిజన్లు.. మీరే ఆ ప్లేస్‌లో ఉంటే ఏం చేస్తారంటూ..!
ఆ వీడియో ప్రకారం.. ముందుగా ఓ గాజు పలక తీసుకోవాలి. ఆ తర్వాత దానిపై ఒక స్పూన్‌తో పాలు వేయాలి. ఆ తర్వాత గాజు పలకను ఏటవాలుగా వంచితే పాలు ముందుకు వెళతాయి. ఆ పాలు నెమ్మదిగా ప్రవహిస్తూ వెనుక తెల్లటి చారలు ఏర్పడినట్టైతే ఆ పాలు స్వచ్ఛమైనవి. అలా కాకుండా పాలు చాలా వేగంగా ప్రవహిస్తూ, వెనుక తెల్లటి చారలు ఏర్పడకుండా ఉంటే, పాలలో నీరు ఎక్కువగా కలిసినట్లు అర్థం. FSSAI షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.