Anand Mahindra: ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియోను చూసి ఉలిక్కిపడుతున్న నెటిజన్లు.. మీరే ఆ ప్లేస్‌లో ఉంటే ఏం చేస్తారంటూ..!

ABN , First Publish Date - 2023-06-12T15:52:06+05:30 IST

భారత పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు ఆసక్తికరంగా లేదా ఫన్నీగా అనిపించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసి రెండు ప్రశ్నలు అడిగారు.

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియోను చూసి ఉలిక్కిపడుతున్న నెటిజన్లు.. మీరే ఆ ప్లేస్‌లో ఉంటే ఏం చేస్తారంటూ..!

భారత పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు ఆసక్తికరంగా లేదా ఫన్నీగా అనిపించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసి రెండు ప్రశ్నలు అడిగారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఆ ట్వీట్ (Anand Mahindra Tweet) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి అడవిలో (Forest) జీప్ ముందు భాగంలో కూర్చుని ఫొటోలు తీసుకుంటున్నాడు.

అంతలో పక్క నుంచి ఓ సింహం (Lion) నెమ్మదిగా వచ్చి అతడి ముందు నిల్చుని అతడినే సీరియస్‌గా చూస్తోంది. ఆ వ్యక్తికి ఏం చేయాలో తెలియలేదు. ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ``మీరే ఆ వ్యక్తి స్థానంలో ఉంటే.. 1)వెంటనే మీరు ఏం ఆలోచిస్తారు, 2)మొదట మీరు ఏం చేస్తారు`` అని ప్రశ్నించారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్‌ను దాదాపు 13 లక్షల మంది వీక్షించారు. 8 వేల మంది లైక్ చేశారు.

Viral Video: ఈ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం.. అందరి ముందే ఓ మనిషిని తినేసిన షార్క్!

ఆనంద్ మహీంద్రా అడిగిన ప్రశ్నలకు నెటిజన్లు తమదైన శైలిలో సమాధానం చెబుతున్నారు. ``నేనే అతడి స్థానంలో ఉంటే మొదట ``అమ్మా`` అని అరుస్తా``, ``వెంటనే దేవుడ్ని ప్రార్థిస్తా``, ``ఆ సమయంలో నా మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది``, ``సింహం ఏం చేయకుండానే ప్రాణాలు పోతాయి`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-12T15:52:06+05:30 IST