ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: సెలవుల తర్వాత ఆఫీసుకు తిరిగొచ్చిన మేనేజర్‌.. టేబుల్‌లో ఫైళ్ల కోసం వెతుకుతోంటే లోపల కనిపించిన సీన్ చూసి..!

ABN, First Publish Date - 2023-05-20T14:06:57+05:30

సెలవుల ముగించుకుని ఆఫీసుకు తిరిగొచ్చిన ఓ మేనేజర్‌కు ఓ ప్రత్యేక అతిథి ఆహ్వానం పలికింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Viral Video: సెలవుల ముగించుకుని ఆఫీసుకు తిరిగొచ్చిన ఓ మేనేజర్‌కు ఓ ప్రత్యేక అతిథి ఆహ్వానం పలికింది. ఇలా చాలా రోజుల తర్వాత ఆఫీసుకు వచ్చిన మేనేజర్ ఆ అతిథి ఆహ్వానంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ఆస్ట్రేలియాలో (Australia) జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. బార్‌లో మేనేజర్‌గా పనిచేసే ఓ వ్యక్తి తన పర్సనల్ పనుల కోసం కొన్ని రోజులు సెలవులు తీసుకున్నాడు. తన పనులు ముగించుకుని తిరిగి ఆఫీస్‌కు వచ్చాడు. ఇక చాలా రోజుల వరకు అతడి డెస్క్ ఖాళీగానే ఉండిపోయింది. మనుషుల కదలికలు లేకపోవడంతో ఆ డెస్క్ డ్రాయర్‌లో ఓ పాము తిష్ట వేసింది. మేనేజర్ వెళ్లి తన ఫైళ్ల కోసం డెస్క్ తెరవగానే అతడికి అందులో పాము దర్శనమిచ్చింది.

అంతే.. వెంటనే పాములను పట్టేవారికి కబురు చేశారు ఆఫీస్ నిర్వాహకులు. వారి సమాచారంతో సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్ 24/7 వాళ్లు ఆఫీస్‌కు వచ్చి ఆ పామును పట్టుకెళ్లారు. వారే తమ ఫేస్‌బుక్ పేజీలో ఈ ఘటన తాలూకు వీడియోను కూడా పోస్ట్ చేశారు. దాంతో విషయం బయటకు తెలిసింది. అలాగే వీడియో కూడా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ... " నాకు పాము కనిపించిన విచిత్రమైన ప్రదేశం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అది ఏకంగా నా బూట్లలో కనిపించింది. చిన్న కార్పెట్ పైథాన్ చాలా బాగుంది" అని ఒకరు, "ఇప్పుడు పాములు పని చేయబోతున్నాయి! అందంగా ఉన్నాయి!!" అంటూ మరోకరు కామెంట్ చేశారు. "నిజంగా చాలా బాగుంది. అసలు అంత చిన్న ప్రదేశాల్లో అవి ఎలా వెళ్తాయో అర్థం కాదు" అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేశారు.

Wonderful Trick: ఈ యువతి టెక్నిక్ అదుర్స్.. అంత లావున్న మహిళ కాస్తా ఒక్క ట్రిక్‌తో ఎంత సన్నగా కనిపిస్తోందో మీరే చూడండి..!

Updated Date - 2023-05-21T08:53:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising