ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Marriage: పెళ్లి రోజే ఈ వరుడికి చుక్కలు కనిపించాయి.. ఏ గొడవా లేకుండానే వివాహం జరిగింది కానీ..

ABN, First Publish Date - 2023-03-18T15:45:10+05:30

తీరా పెళ్లికి బయల్దేరే సమయంలో షాకింగ్ విషయం తెలిసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. అంతే ఆ వరుడికి చుక్కలు కనిపించాయి.

Marriage
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెళ్లి అంటేనే ఎన్నో పనులుంటాయి. పెళ్లి డేట్ ఫిక్స్ అయిన దగ్గర నుంచీ.. ఆహ్వాన పత్రికలు ముద్రించడం.. కళ్యాణ మండపం బుక్ చేసుకోవడం. వంట మనుషులను ఏర్పాటు చేసుకోవడం. వాహనాలు సమకూర్చుకోవడం. పూల దండలు. లైటింగ్. ఇలా ఒక్కటేంటి? ఎన్ని పనులుంటాయి. అంతేకాదు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని పెళ్లి విషయంలో అనుభవజ్ఞుల సలహాలు కూడా తీసుకుంటారు. అంతగా సన్నద్ధం అవుతుంటారు. అందరిలాగానే ఆ పెళ్లి వారు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా పెళ్లికి బయల్దేరే సమయంలో షాకింగ్ విషయం తెలిసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. అంతే ఆ వరుడికి చుక్కలు కనిపించాయి. అసలు ఇంతకీ ఏమైంది? అయితే ఈ వార్త చదవాల్సిందే.

పెళ్లి (Marriage) ముహూర్తం దగ్గర పడుతోంది. వధువు గ్రామంలో మ్యారేజ్. పెళ్లికూతురు గ్రామానికి వెళ్లేందుకు వరుడు సిద్ధమయ్యాడు. తీరా బయలుదేరే సమయానికి బుక్ చేసుకుంటే ఒక్క వాహనం రాలేదు. డిమాండ్ల పరిష్కారం కోసం వాహన డ్రైవర్లంతా (drivers strike) సమ్మె బాట పట్టారు. దీంతో ఒక్క వాహనం కూడా తిరగడం లేదు. చేసేదేమీలేక వరుడి కుటుంబం నడక అందుకున్నారు. ఇలా దాదాపు 28 కిలోమీటర్లు నడుచుకుంటూ వధువు గ్రామానికి చేరుకున్నారు. ముహూర్తం సమయానికైతే వరుడు చేరుకుని.. వధువు మెడలో తాళి కట్టాడు. ఘనంగానే పెళ్లి జరిగింది. కానీ 28 కిలోమీటర్లు నడిచి వధువు గ్రామానికి చేరుకోవడానికి మాత్రం వరుడి కుటుంబానికి చుక్కలు కనిపించాయి. ఈ సంఘటన ఒడిశా (Odisha)లోని రాయగడ జిల్లా (Rayagada District)లో చోటు చేసుకుంది.

తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ బుధవారం నుంచి ఒడిశాలో వాహన డ్రైవర్లు ఉద్యమ బాటు పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలను నిలిపివేసి ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పెళ్లికోసం ముందుగానే వాహనాలు బుక్‌ చేసుకున్నప్పటికీ యజమానులు రద్దు చేసుకున్నారు. దీంతో వరుడి కుటుంబం కల్యాణ్‌ సింగ్‌పూర్‌ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న వధువు గ్రామమైన దిబలపాడుకు కాలినడకన చేరుకున్నారు. ఇలా గురువారం రాత్రంతా రోడ్లపై నడిచి శుక్రవారం ఉదయానికి వధువు ఇంటికి చేరుకున్నారు. ఎట్టకేలకు పెళ్లయితే ఘనంగా జరిగింది. కానీ తిరిగి అత్తారింటికి చేరుకునేందుకు వధువు కుటుంబ సభ్యులకు కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులందరూ పెళ్లి కూతురు ఇంట్లోనే ఉండిపోయారు. డ్రైవర్లు సమ్మె విరమించిన తర్వాత వాహనాలు బుక్ చేసుకుని ఇంటికి వెళ్తామని వరుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు నిరసనలను విరమించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా, డీజీపీ ఎస్‌కే బన్సక్‌ డ్రైవర్లను కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బీమా (Insurance), పింఛన్‌, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలంటూ డ్రైవర్లంతా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టారు.

ఇది కూడా చదవండి: Couple: కోర్టు మెట్లెక్కిన కొత్త పెళ్లి జంట.. మా ప్రాణాలతో వాళ్లు చెలగాటం ఆడారు.. రూ.40 కోట్ల నష్టపరిహారం ఇప్పించండంటూ..'

Updated Date - 2023-03-18T15:45:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising