Sonu Sood: సోనూ సూద్ పక్కన ఉన్న ఈ కుర్రాడు ఎవరు..? పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అంటూ నెటిజన్ల కామెంట్స్ వెనుక..!
ABN, First Publish Date - 2023-06-21T16:31:14+05:30
కరోనా సమయంలోనూ, ఆ తర్వాత ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి మంచి మనసున్న మనిషిగా గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు సోనూ సూద్. ఎంతో మంది సోన్ సూద్‌ను సోషల్ మీడియా ద్వారా సంప్రదించి తమ సమస్యలు చెప్పుకుంటుంటారు.
కరోనా సమయంలోనూ, ఆ తర్వాత ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి మంచి మనసున్న మనిషిగా గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు సోనూ సూద్ (Sonu Sood). ఎంతో మంది సోనూ సూద్‌ను సోషల్ మీడియా ద్వారా సంప్రదించి తమ సమస్యలు చెప్పుకుంటుంటారు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఫొటోలు, పోస్టులు, వీడియోలను సోనూ తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా సోనూ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో మొక్కజొన్న కంకులను విక్రయిస్తున్న ఓ వ్యక్తి వీడియోను షేర్ చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి (Manali) నుంచి సిస్సు వైపు కారులో వెళ్తున్న సోనూ మార్గమధ్యంలో రోడ్డు పక్కన ఓ మొక్కజొన్న స్టాల్ (Corn Stall) దగ్గర ఆగారు. ఆ స్టాల్ నడుపుతున్న శేష్ ప్రకాష్ నిషాద్‌తో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని జాన్ పూర్‌కు చెందిన శేష్.. సోనూతో తన వ్యాపారం గురించి మాట్లాడాడు. ఒక్కొక్క మొక్కజొన్న రూ.50 కి విక్రయిస్తానని.. ప్రతి రోజు 100 మొక్కజొన్నలను విక్రయిస్తానని చెప్పాడు. అంతేకాదు తనకి నలుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారని చెప్పాడు.
Bahubali Samosa: వావ్.. తింటూనే సంపాదించే సూపర్ ఛాన్స్.. ఈ సమోసాను 30 నిమిషాల్లో తింటే రూ.71 వేలు మీవే..!
తనకు ఇంకా పెళ్లి (Marriage) కాలేదని శేష్ చెప్పగానే.. సోనూ సూద్ స్పందించారు. నిషాద్‌కు మంచి మ్యాచ్ చెప్పమని సోనూ సూద్ సూచించారు. వీరిమధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను సోనూ సూద్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. సోనూ నిజంగా చాలా మంచి మనిషి అని ప్రశంసిస్తున్నారు.
Updated Date - 2023-06-21T16:31:14+05:30 IST