Bahubali Samosa: వావ్.. తింటూనే సంపాదించే సూపర్ ఛాన్స్.. ఈ సమోసాను 30 నిమిషాల్లో తింటే రూ.71 వేలు మీవే..!

ABN , First Publish Date - 2023-06-21T16:14:56+05:30 IST

పుట్టిన రోజు నాడు అందరూ కేక్ కట్ చేస్తారు. బర్త్ డే రోజు కేక్ కాకుండా వెరైటీగా సమోసా కట్ చేస్తే ఎలా ఉంటుంది. అది సాధారణ సమోసా కాదు.. 12 కేజీల బరువుండే బాహుబలి సమోసా. అవును.. ప్రస్తుతం ఈ సమోసా, దాని గురించి జరుగుతున్న పందెం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Bahubali Samosa: వావ్.. తింటూనే సంపాదించే సూపర్ ఛాన్స్.. ఈ సమోసాను 30 నిమిషాల్లో తింటే రూ.71 వేలు మీవే..!

పుట్టిన రోజు నాడు అందరూ కేక్ కట్ చేస్తారు. బర్త్ డే రోజు కేక్ కాకుండా వెరైటీగా సమోసా (Samosa) కట్ చేస్తే ఎలా ఉంటుంది. అది సాధారణ సమోసా కాదు.. 12 కేజీల బరువుండే బాహుబలి సమోసా (Bahubali Samosa). అవును.. ప్రస్తుతం ఈ సమోసా, దాని గురించి జరుగుతున్న పందెం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది. ఈ 12 కేజీల బాహుబలి సమోసా ధర దాదాపు 1500 రూపాయలు. దీనిని తినడం అంటే మాటలతో పని కాదు. ఒకవేళ ఈ సమోసాను 30 నిమిషాల్లో ఎవరైనా తినగలిగితే బహుమతిగా రూ.71 వేలు పొందవచ్చు.

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మీరట్‌ (Meerut)లో ఒక దుకాణదారుడు రూపొందించిన బాహుబలి సమోసాలు, దానికి సంబంధించిన ఛాలెంజ్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. లాల్‌కుర్తిలో ఉన్న ``కౌశల్ స్వీట్స్`` యజమాని ఉజ్వల్ కౌశల్ తన స్వీట్ షాప్‌ను పాపులర్ చేయడానికి బ్రహ్మాండమైన ఐడియా వేశాడు. అందుకోసమే 12 కిలోల బాహుబలి సమోసాకు రూపకల్పన చేశాడు. 12 కేజీల సమోసా తయారు చేసేందుకు నలుగురు వంట మనుషులకు దాదాపు 6 గంటల సమయం పడుతుంది. ఆ సమోసా లోపల దాదాపు 7 కిలోల ఆలూ కర్రీ ఉంటుంది. మిగతా ఐదు కిలోలు పిండి ఉంటుంది.

Viral Video: రోడ్డు పక్కన ప్రాణాపాయంలో ఒంటె.. ఒక్క బాటిల్‌తో దాన్ని ఎలా కాపాడాడో చూడండి..

బంగాళదుంపలు, బఠానీలు, మసాలాలు, పనీర్, గింజలతో ఆ కూర తయారు చేస్తారు. ఈ ఒక్క సమోసాను పెనంలో వేయించడానికి దాదాపు గంటన్నర సమయం పడుతుంది. ఈ సమోసాలకు గుర్తింపు తీసుకురావడం కోసం ఉజ్వల్ ఓ ఛాలెంజ్ ఏర్పాటు చేశాడు. ఈ సమోసాను 30 నిమిషాల్లో ఎవరైనా తినగలిగితే బహుమతిగా రూ.71 వేలు పొందవచ్చని ప్రకటించాడు. దీంతో ఈ సమోసా బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ సమోసాల కోసం ఆర్డర్లు వస్తున్నాయని ఉజ్వల్ తెలిపారు. బర్త్ డేల్లో కేక్‌లకు బదులు చాలా మంది ఈ బాహుబలి సమోసాలను కట్ చేస్తున్నారని, ఈ సమోసా కావాలంటే రెండ్రోజుల ముందు ఆర్డర్ ఇవ్వాలని తెలిపారు.

Updated Date - 2023-06-21T16:15:09+05:30 IST