ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: డైమండ్ నెక్లెస్ ఎత్తుకెళ్లిన ఎలుక.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!

ABN, First Publish Date - 2023-02-05T09:13:20+05:30

నగల దుకాణాల్లోకి దొంగలు చొరబడి లూటీ (Stealing) చేయడం అనేది కామన్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Viral Video: నగల దుకాణాల్లోకి దొంగలు చొరబడి లూటీ (Stealing) చేయడం అనేది కామన్. అంతేందుకు అప్పుడప్పుడు కొందరు కస్టమర్ల రూపంలో జ్యువెలరీ షాపులకు (Jewellery Store) వెళ్లి చేతివాటం చూపించడం కూడా చూసి ఉంటాం. కానీ, ఎలుక (Rat) చోరీ చేయడం చూశారా? అది కూడా ఎంతో విలువైన డైమండ్ నెక్లెస్ ఎత్తుకెళ్లడం. ఈ ఘటన తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆభరణాల దుకాణంలోని వజ్రాల హారాన్ని ఓ ఎలుక చోరీ చేసిన వీడియోను రాజేష్ హింగస్కర్ (Rajesh Hingankar) అనే ఐపీఎస్ అధికారి ట్విటర్‌లో (Twitter) షేర్ చేశారు. వీడియోకు ఆయన 'ఈ ఎలుక ఆ డైమండ్ నెక్లెస్ ఎవరికి తీసుకెళ్లిందో?' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. అంతే.. వీడియో కాస్తా వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. 'తన గర్ల్‌ఫ్రెండ్‌కు తీసుకెళ్తోందేమో', 'అందరి పరిస్థితి ఒక్కటే.. అది భర్త అయినా, ఎలుకైనా', 'ఈ చోరీ ఫిబ్రవరి 14కు ముందు జరిగింది కనుక కొంచెం ఆలోచించాల్సిందే' అని కామెంట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 30వేలకు పైగా వ్యూస్, 500పైగా లైక్స్ వచ్చిపడ్డాయి. ఇంకేందుకు ఆలస్యం ఓ చిన్న ఎలుక అంత కాస్ట్లీ నెక్లెస్‌ను ఎలా ఎత్తుకెళ్లిందో మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - 2023-02-05T09:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising