ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం.. అందరి ముందే ఓ మనిషిని తినేసిన షార్క్!

ABN, First Publish Date - 2023-06-11T20:52:00+05:30

ఈజిప్టులోని హుర్ఘాదా తీరంలో గురువారం జరిగిన షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడేందుకు ప్రయత్నిస్తుండగా, టైగర్ షార్క్ అతడిని నీటి కిందకు లాక్కుని వెళ్లిపోతుండడం కనిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈజిప్టు (Egypt)లోని హుర్ఘాదా తీరంలో (Hurghada Beach) గురువారం జరిగిన షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడేందుకు ప్రయత్నిస్తుండగా, టైగర్ షార్క్ అతడిని నీటి కిందకు లాక్కుని వెళ్లిపోతుండడం కనిపిస్తోంది (Shark eats man). ఆ వ్యక్తి పేరు వ్లాదిమిర్ పోపోవ్‌. రష్యాకు చెందిన 24 ఏళ్ల పోపోవ్ ఈజిప్టులో స్థిరపడ్డాడు. @Alphafox78 అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి బీచ్ నుంచి కాస్త లోపలికి ఈత కొట్టుకుంటూ వెళ్లాడు. అంతలో అతడి దగ్గరకు ఓ టైగర్ షార్క్ (Shark) ఫిష్ వచ్చింది. దానిని గమనించిన అతడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అది అతడిని నీటి అడుక్కి లాక్కుని వెళ్లిపోయి తినేసింది. బీచ్‌లో ఉన్న పర్యవేక్షకులు వెంటనే స్పందించి ఆ షార్క్ చేపను పట్టుకున్నారు. ఆ ఘటన జరుగుతున్నప్పుడు బీచ్ ఒడ్డున ఉన్న వారు కేకలు వేయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఎవరూ కాపాడే పరిస్థితి లేదు.

Viral Video: సూపర్ ఫాస్ట్ క్వాలిటీ చెకింగ్.. రైస్ బ్యాగ్‌లను ఆ మహిళ ఎంత వేగంగా చెక్ చేస్తోందో చూడండి..

రెండ్రోజుల పాటు ఆ బీచ్‌ను ఈజిప్టు పర్యావరణ అధికారులు మూసేశారు. కాగా, ఆ బీచ్‌లో 2022 జులైలో కూడా ఇలాంటి దుర్ఘటన జరిగింది. ఆ సమయంలో ఇద్దరు మహిళలను ఓ షార్క్ చంపేసింది. కాగా, తాజా షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. దాదాపు 1.4 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు.

Updated Date - 2023-06-11T20:52:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising