Viral Video: సూపర్ ఫాస్ట్ క్వాలిటీ చెకింగ్.. రైస్ బ్యాగ్‌లను ఆ మహిళ ఎంత వేగంగా చెక్ చేస్తోందో చూడండి..

ABN , First Publish Date - 2023-06-11T20:25:40+05:30 IST

ప్రస్తుత డిజిటల్ యుగంలో రకరకాల వీడియోలు ఎంతో వేగంగా అందరినీ చేరుతున్నాయి. మారుమూల గ్రామాల్లోని వ్యక్తుల ప్రతిభ కూడా ప్రపంచం నలుమూలలకు క్షణాల్లో వెళ్లిపోతోంది. తాజాగా ఓ యువతికి సంబంధించిన వీడియో అలాగే వైరల్ అవుతోంది.

Viral Video: సూపర్ ఫాస్ట్ క్వాలిటీ చెకింగ్.. రైస్ బ్యాగ్‌లను ఆ మహిళ ఎంత వేగంగా చెక్ చేస్తోందో చూడండి..

ప్రస్తుత డిజిటల్ యుగంలో రకరకాల వీడియోలు ఎంతో వేగంగా అందరినీ చేరుతున్నాయి. మారుమూల గ్రామాల్లోని వ్యక్తుల ప్రతిభ కూడా ప్రపంచం నలుమూలలకు క్షణాల్లో వెళ్లిపోతోంది. తాజాగా ఓ యువతికి సంబంధించిన వీడియో అలాగే వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియోలో ఓ మహిళ సంచుల్లోని (Rice Bags) ధాన్యం నాణ్యతను పరీక్షిస్తోంది. ఆమె వేగం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.

ఆహార ధాన్యాలతో నిండిన బస్తాల నాణ్యతను (Quality Inspection) తనిఖీ చేయడం అనేది గోదాముల్లో తప్పనిసరిగా పాటించాల్సిన ఓ నియమం. ధాన్యం నాణ్యత సరిగ్గా ఉంటేనే ఆ బ్యాగ్‌లను బయటకు పంపిస్తారు. ప్రస్తుతం అలాగే ఒక మహిళ బియ్యం బస్తాల నాణ్యతను తనిఖీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొందరు కూలీలు ధాన్యం బస్తాలను గోదాము నుంచి బయటకు తరలిస్తున్నారు. ఆ సమయంలో ఓ గట్టుపై కూర్చున్న యువతి ప్రతి బస్తా నుంచి ధాన్యంను బయటకు తీసి పరీక్షిస్తోంది (Quality Inspection Of Rice Bags). ఆ ప్రక్రియను ఆమె అత్యంత వేగంగా చేస్తోంది.

Bride: వివాహ వేడుకలో చిరిగిన వధువు గౌను.. సూది పట్టుకుని రంగంలోకి దిగిన వరుడు.. వైరల్ అవుతున్న వీడియో!

ఈ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 23 లక్షల మంది వీక్షించారు. 5 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``ఆమె ఎందుకు అలా చేస్తోంది? ఆమె నిజంగా క్వాలిటీ చెక్ చేస్తోందా? లేదా ఫార్మాలిటీ పూర్తి చేస్తోందా`` అని ఒకరు ప్రశ్నించారు.

Updated Date - 2023-06-11T20:25:40+05:30 IST