Bride: వివాహ వేడుకలో చిరిగిన వధువు గౌను.. సూది పట్టుకుని రంగంలోకి దిగిన వరుడు.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2023-06-11T17:16:25+05:30 IST

వివాహం అనేది ఎప్పటికీ మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వివాహ వేడుకలో అందంగా కనిపించేందుకు ఎంతగానో సంసిద్ధులవుతారు. ముఖ్యంగా వస్త్రధారణ గురించి బాగా శ్రద్ధ తీసుకుంటారు. అన్ని వివాహ సాంప్రదాయాల్లోనూ వధూవరులు తమ బట్టలు, అలంకరణ పైనే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.

Bride: వివాహ వేడుకలో చిరిగిన వధువు గౌను.. సూది పట్టుకుని రంగంలోకి దిగిన వరుడు.. వైరల్ అవుతున్న వీడియో!

వివాహం (Marriage) అనేది ఎప్పటికీ మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వివాహ వేడుకలో అందంగా కనిపించేందుకు ఎంతగానో సంసిద్ధులవుతారు. ముఖ్యంగా వస్త్రధారణ (Wedding dress) గురించి బాగా శ్రద్ధ తీసుకుంటారు. అన్ని వివాహ సాంప్రదాయాల్లోనూ వధూవరులు తమ బట్టలు, అలంకరణ పైనే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఒక్కోసారి అనుకోని అవాంతరాలు ఎదురవుతుంటాయి. తాజగా ఓ వధువుకు (Bride) అలాంటి పరిస్థితే ఎదురైంది.

రిసెప్షన్ (Wedding Reception) రోజున తన పెళ్లి గౌను చిరిగిపోయిందని తెలుసుకున్న వధువు ఎలా స్పందిస్తుంది? కచ్చితంగా ఏ వధువైనా మానసిక ప్రశాంతత కోల్పోతుంది. ఎవరైనా టైలర్ కోసం వ్యక్తి కోసం శోధిస్తుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వధువుకు టైలర్ కోసం వెతికే అవసరం రాలేదు. ఎందుకంటే ఆమె ఓ సర్జన్‌ను వివాహం చేసుకుంది. శస్త్ర చికిత్సల నిపుణుడైన డాక్టర్ (Surgeon Groom) తన భార్య కోసం టైలర్‌గా మారాడు.

Viral Video: రోడ్డు ప్రక్క వ్యక్తి ట్యాలెంట్‌కు ప్రముఖ గాయని ఫిదా.. వీడియో చూస్తే మీరు కూడా ఇష్టపడకుండా ఉండలేరు..

చిరిగిపోయిన తన భార్య వెడ్డింగ్ గౌన్‌ను తన అద్భుత నైపుణ్యంతో కుట్టేశాడు. ఫోటోగ్రాఫర్ రెబెకా ఆన్ థామస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. నెటిజన్లు లాఫింగ్ ఏమోజీలతో స్పందించారు.

Updated Date - 2023-06-11T17:16:25+05:30 IST