Viral Video: చీర కట్టుకుని.. కళ్లకు గంతలు కట్టుకుని.. స్కూటీపై నిల్చుని రివర్స్ జంప్.. ఆ యువతి ఎందుకిలా అవాక్కయిందో మీరే చూడండి..!
ABN, First Publish Date - 2023-06-16T19:43:16+05:30
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది రీల్స్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని లైక్స్, పాపులారిటీ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా బైక్ స్టంట్స్ కూడా చేసేస్తున్నారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది రీల్స్ (Reels) కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని లైక్స్, పాపులారిటీ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా బైక్ స్టంట్స్ (Bike Stunts) కూడా చేసేస్తున్నారు. తాజాగా ఓ మహిళ చీర కట్టుకుని, కళ్లకు గంతలు కట్టుకుని చేసిన రివర్స్ జంప్ చాలా మందికి షాక్ కలిగిస్తోంది (Saree clad girl did back flip). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
Shalu Kirar అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఓ యువతి రెడ్ కలర్ చీర కట్టుకుని స్కూటీపై నిల్చుంది. ఆ తర్వాత గాల్లోకి ఎగిరి రివర్స్ జంప్ చేసింది. చివర్లో కాస్తా బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై మోకాళ్లతో కూర్చుంది. ఏదేమైనా ఆ మహిళ ట్యాలెంట్‌కు, స్టైల్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో అటు వైపు స్కూటీ మీద వెళ్తున్న యువతి ఆ జంప్ చూసి షాకైంది.
Viral Video: అతడు చేసిన ఒక్క పనితో ఈ దున్నపోతుకు పట్టరాని ఆగ్రహం.. ప్రాణభయంతో పరుగులు తీస్తున్నా వదిలి పెట్టలేదుగా..!
ఈ వీడియో ఇప్పటివరకు 8.6 లక్షల లైకులు దక్కించుకుంది. ఈ వీడియోలో స్టంట్ చేసిన మహిళను కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. ఏ మాత్రం తేడా జరిగినా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుందని కొందరు హెచ్చరించారు. మరికొందరు అద్భుతంగా జంప్ చేశారని ప్రశంసించారు.
Updated Date - 2023-06-16T19:43:16+05:30 IST