Viral Video: అతడు చేసిన ఒక్క పనితో ఈ దున్నపోతుకు పట్టరాని ఆగ్రహం.. ప్రాణభయంతో పరుగులు తీస్తున్నా వదిలి పెట్టలేదుగా..!
ABN , First Publish Date - 2023-06-16T19:07:52+05:30 IST
కొన్ని జంతువులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో, కోపం వచ్చినప్పుడు అంతకు అంతా క్రూరంగా మారిపోతాయి. తమకు కోపం తెప్పించిన వారి భరతం పడతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ అప్‌లోడ్ అవుతూనే ఉన్నాయి.
కొన్ని జంతువులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో, కోపం వచ్చినప్పుడు అంతకు అంతా క్రూరంగా మారిపోతాయి. తమకు కోపం తెప్పించిన వారి భరతం పడతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు (Animal Videos) ప్రతిరోజూ అప్‌లోడ్ అవుతూనే ఉన్నాయి. వాటిల్లో కొన్ని నెటిజన్లను ఆకట్టుకుని వైరల్‌గా (Viral Video) మారుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తనకు కోపం తెప్పించిన ఓ వ్యక్తికి ఓ గేదె (Buffalo) తగిన బుద్ధి చెప్పింది.
Sneha Gupta అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి గేదె ముందు నిల్చుని ఓ వస్త్రంతో దానిని రెచ్చ గొట్టాడు. దీంతో ఆ గేదెకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ యువకుడి వెంట పడింది. పలుసార్లు అతడిని పైకి ఎత్తి కింద పడేసింది. అతడు భయంతో పారిపోతున్నా ఆ గేదె శాంతించలేదు. వెంబడించి మరీ తన ప్రతాపం చూపించింది. ఈ ఘటనలో ఆ యువకుడికి ఓ ఎముక విరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Newly Married Couple: ఈ కొత్త పెళ్లి జంటకు ఇదేం పాడుబుద్ధి.. కారుపై ఆ నూతన వధూవరులు ఏం రాశారో చదివితే..!
ఐదు రోజుల క్రితం షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 70 వేల మంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``ఇంకెప్పుడూ అలాంటి పనులు చేయడు``, ``పాపం.. నడుం విరిగి ఉంటుంది`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.