Newly Married Couple: ఈ కొత్త పెళ్లి జంటకు ఇదేం పాడుబుద్ధి.. కారుపై ఆ నూతన వధూవరులు ఏం రాశారో చదివితే..!

ABN , First Publish Date - 2023-06-16T17:35:21+05:30 IST

వివాహం చేసుకుని నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న కొత్త దంపతులకు బంధువులు, స్నేహితులు బహుమతులు ఇచ్చే సాంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. నూతన దంపతుల అవసరాలకు అనుగుణంగా కొందరు వస్తు రూపంలో బహుమతులు ఇస్తే, మరికొందరు నగదు రూపంలో గిఫ్ట్స్ ఇస్తారు.

Newly Married Couple: ఈ కొత్త పెళ్లి జంటకు ఇదేం పాడుబుద్ధి.. కారుపై ఆ నూతన వధూవరులు ఏం రాశారో చదివితే..!

వివాహం (Marriage) చేసుకుని నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న కొత్త దంపతులకు బంధువులు, స్నేహితులు బహుమతులు ఇచ్చే సాంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. నూతన దంపతుల (Newly Wed couple) అవసరాలకు అనుగుణంగా కొందరు వస్తు రూపంలో బహుమతులు ఇస్తే, మరికొందరు నగదు రూపంలో గిఫ్ట్స్ ఇస్తారు (Wedding Gifts). ఏదేమైనా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న వారికి బహుమతులు ఇవ్వడం అనేది అన్ని మత సాంప్రదాయాల్లోనూ ఉంది.

అమెరికా (America)లోని తాజాగా వివాహం చేసుకున్న ఓ కొత్త జంట వెరైటీ చర్యతో వార్తల్లోకి ఎక్కింది. తమకు పెళ్లి గిఫ్ట్‌గా నగదు కావాలని కోరుతూ ఓ కొత్త జంట రిక్వెస్ట్ చేసింది. తమ కారుపై జస్ట్ మ్యారీడ్ అని రాసి పక్కనే Venmo ఐడీని కూడా ప్రింట్ చేయించారు. Venmo అనేది అమెరికాలో మన ఫోన్ పే తరహాలోని ఓ మొబైల్ చెల్లింపు యాప్. అమెరికాలో ఈ యాప్‌ను ఉపయోగించుకుని డబ్బును బదలీ చేస్తుంటారు. తన ఐడీని కారుపై ప్రింట్ చేయడం ద్వారా ఆ జంట క్యాష్ గిఫ్ట్స్‌ కావాలని విజ్ఞప్తి చేస్తోంది.

Viral: 90 ఏళ్ల వృద్ధుడిపై 19 ఏళ్ల యువతి అత్యాచారం కేసు.. 20 ఏళ్ల క్రితమే అతడు చనిపోయాడని తెలిసి అవాక్కైన పోలీసులు..!

ఈ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన ప్రజలు దానిపై ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ``ఈ ఐడియా అద్భుతం``, ``బహుమతులు సరే.. పెళ్లి విందు ఎక్కడ`` అంటూ కామెంట్లు చేస్తున్నారు. భారత్‌లో కూడా ఓ జంట గతంలో ఇలాంటి ట్రిక్ ప్లే చేసింది. తమ కారుపై పేటీఎమ్ క్యూఆర్ కోడ్‌ను ముద్రించింది.

Updated Date - 2023-06-16T17:35:21+05:30 IST