Viral: 90 ఏళ్ల వృద్ధుడిపై 19 ఏళ్ల యువతి అత్యాచారం కేసు.. 20 ఏళ్ల క్రితమే అతడు చనిపోయాడని తెలిసి అవాక్కైన పోలీసులు..!

ABN , First Publish Date - 2023-06-16T16:00:27+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. మీరట్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతి 23 ఏళ్ల యువకుడిపై అత్యాచారం కేసు పెట్టింది. ఆ యువకుడితో పాటు అతడి తండ్రి, తాత, ముత్తాత మీద కూడా అత్యాచారం కేసు పెట్టింది.

Viral: 90 ఏళ్ల వృద్ధుడిపై 19 ఏళ్ల యువతి అత్యాచారం కేసు.. 20 ఏళ్ల క్రితమే అతడు చనిపోయాడని తెలిసి అవాక్కైన పోలీసులు..!

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మీరట్‌లో ఓ విచిత్ర సంఘటన (Bizarre incident) వెలుగులోకి వచ్చింది. మీరట్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతి 23 ఏళ్ల యువకుడిపై అత్యాచారం కేసు పెట్టింది. ఆ యువకుడితో పాటు అతడి తండ్రి, తాత, ముత్తాత మీద కూడా అత్యాచారం కేసు పెట్టింది. విశేషమేమిటంటే ఆ ముత్తాత 20 ఏళ్ల క్రితమే మరణించాడు. ఈ విషయాలన్నీ తెలిసి జిల్లా ఎస్పీ అవాక్కయ్యారు (Crime News). అసలు కథేంటంటే..

మీరట్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి రెండేళ్లుగా 23 ఏళ్ల యువకుడితో ప్రేమాయణం (Love Affair)సాగిస్తోంది. అతడు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. చివరకు పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఆ యువతి తన తండ్రికి అసలు విషయం చెప్పింది. ఆ యువతి తండ్రి నేరుగా యువకుడి ఇంటికి వెళ్లి నిలదీశాడు. యువకుడి కుటుంబ సభ్యులు ఆ యువతి తండ్రిని బెదిరించారు. పోలీసులకు చెబితే చంపేస్తామని హెచ్చరించారు. వారం రోజుల తర్వాత ఆ యువతి తండ్రి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేశాడు.

Green Peas: స్నాక్స్‌గా బాగుంటాయని ఇలాంటి బఠానీలు తీనే అలవాటుందా..? ఈ వీడియోను చూస్తే ఇకపై వాటిని తినాలంటే..!

ఆ యువకుడు, యువకుడి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో యువకుడితో పాటు అతడి తండ్రి, తాత, ముత్తాత పేర్లను జత చేశాడు. దీంతో అందరికీ నోటీసులు వెళ్లాయి. 20 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరు మీద కూడా నోటీసు రావడంతో యువకుడి కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. విషయం విన్న ఎస్పీ అవాక్కయ్యారు. మొత్తం వ్యవహారంపై దర్యాఫ్తు చేయాల్సిందిగా స్థానిక పోలీసులను ఆదేశించారు.

Updated Date - 2023-06-16T16:00:27+05:30 IST