Green Peas: స్నాక్స్‌గా బాగుంటాయని ఇలాంటి బఠానీలు తీనే అలవాటుందా..? ఈ వీడియోను చూస్తే ఇకపై వాటిని తినాలంటే..!
ABN , First Publish Date - 2023-06-16T15:34:20+05:30 IST
మధుమేహం, రక్తపోటు వంటి లైఫ్‌స్టైల్ రోగాలు చుట్టుముడుతుండడంతో గత కొన్నేళ్లుగా చాలా మందికి తమ ఆహారపు అలవాట్ల గురించిన స్పృహ విపరీతంగా పెరిగింది. ఆరోగ్యకర ఆహారం తీసుకునేందుకే చాలా మంది మొగ్గు చూపుతున్నారు
మధుమేహం (Diabetes), రక్తపోటు (Blood pressure) వంటి లైఫ్‌స్టైల్ రోగాలు చుట్టుముడుతుండడంతో గత కొన్నేళ్లుగా చాలా మందికి తమ ఆహారపు అలవాట్ల (Food Habbits) గురించిన స్పృహ విపరీతంగా పెరిగింది. ఆరోగ్యకర ఆహారం తీసుకునేందుకే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. షుగర్, బీపీల విషయంలో జాగ్రత్త పడేందుకు చాలా మంది వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఏది మంచి ఆహారం అనే విషయంలో చాలా మందికి అనేక రకాల అనుమానాలున్నాయి. ముఖ్యంగా పచ్చి బఠానీ (Green Peas snaks)ల విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి.
బఠానీలకు ఉప్పు కలిపి ఆరోగ్యకర స్నాక్స్‌గా అమ్ముతున్నారు. మీకు అలాంటి బఠానీలు ఇష్టమైనట్టైతే ఇకపై జాగ్రత్తగా ఉండండి. సాల్టెడ్ గ్రీన్ మ్యాటర్ (Salted Green Matar) తయారు చేసే వీడియోను ప్రముఖ ఫుడ్ బ్లాగర్ సలోని బోత్రా షేర్ చేశారు. అసోంలో రూపొందించిన ఈ వీడియో చూస్తే మీరు ఇకపై గ్రీన్ బఠానీలను తినే విషయంలో జాగ్రత్త పడతారేమో. ఆ ఫ్యాక్టరీలో ముందుగా మామూలు బఠానీలకు ఆకపచ్చని కృత్రిమ రంగు వేస్తున్నారు. ఆ తర్వాత పప్పులను కాసేపు ఎండబెట్టి, ఆపై డీప్ ఫ్రై చేస్తున్నారు.
Bride: వధువు స్నేహితుల కామెంట్స్ విని ఏడుస్తూ వెళ్లిపోయిన వరుడు.. ఈ పెళ్లి నాకొద్దంటూ తేల్చిచెప్పిన యువతి.. అసలు కథేంటంటే..!
ఆ వీడియోలో గ్రీన్ పీస్ బఠానీలను చాలా అనారోగ్యకర పరిస్థితుల్లో తయారు చేస్తున్నారు. పైగా పచ్చగా కనిపించడం కోసం కృత్రిమ రంగులను వాడుతున్నారు. ఈ వీడియో చూసి చాలా మంది షాకవుతున్నారు. దాదాపు 1.8 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``నా బాల్యం మొత్తం నాశనమైంది, ఈ బఠానీలు సహజంగా ఆకుపచ్చగా ఉన్నాయని నేను భావించాను`` అని ఒకరు కామెంట్ చేశారు.