ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Seema Haider: బాబూ.. కెమెరా ఆన్‌లోనే ఉంది..? పదే పదే హెచ్చరించిన యాంకర్.. సీమా హైదర్ జంటను లైవ్‌లోకి తీసుకుంటే..!

ABN, First Publish Date - 2023-09-04T18:54:53+05:30

తన ప్రేమికుడు సచిన్ మీనాను పెళ్లి చేసుకునేందుకు పాకిస్థాన్‌ నుంచి అక్రమంగా బోర్డర్ దాటి భారత్‌లోకి ప్రవేశించిన సీమా హైదర్ కొన్ని నెలల కిందట సంచలనం సృష్టించింది. అప్పట్నుంచి సీమా, సచిన్ పలు సందర్భాల్లో వార్తల్లో ఉంటూ వస్తున్నారు. భారత్, పాకిస్థాన్‌లలో ఈ జంటకు మంచి పాపులారిటీ ఉంది.

తన ప్రేమికుడు సచిన్ మీనా (Sachin Meena)ను పెళ్లి చేసుకునేందుకు పాకిస్థాన్‌ (Pakistan) నుంచి అక్రమంగా బోర్డర్ దాటి భారత్‌ (India)లోకి ప్రవేశించిన సీమా హైదర్ (Seema Haider) కొన్ని నెలల కిందట సంచలనం సృష్టించింది. అప్పట్నుంచి సీమా, సచిన్ పలు సందర్భాల్లో వార్తల్లో ఉంటూ వస్తున్నారు. భారత్, పాకిస్థాన్‌లలో ఈ జంటకు మంచి పాపులారిటీ ఉంది. తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని కోరుతూ సీమా భారత రాష్ట్రపతికి దరఖాస్తు పెట్టుకుంది. ఆమె పాకిస్థాన్ గూఢచారి అనుకుని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ విచారణ కూడా జరుపుతోంది (Sachin-Seema Love story).

కాగా, తాజాగా ఈ జంట ఓ నేషనల్ చానెల్ లైవ్‌లోకి వచ్చింది. కెమేరా (Camera) ఆన్‌లో ఉండగానే వారిద్దరూ ఒకరికొకరు సన్నిహితంగా ఉండడం, చిలిపిగా ఒకరినొకరు కవ్వించుకోవడం చేశారు. లైవ్‌లోనే సీమాను సచిన్ ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో యాంకర్ వారిద్దరినీ హెచ్చరించాడు. ``కెమేరా ఆన్‌లో ఉంది సచిన్‌జీ`` అని యాంకర్ నవ్వుతూ చెప్పాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది.

10 Most Popular Smartphones: ప్రపంచంలోనే అత్యంత పాపులర్ ఫోన్లు ఇవే.. టాప్ 10 లో తొలి 4 ఫోన్లు ఒక్క కంపెనీవే..!

కాగా, ఈ జంటకు బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. వీరిద్దరి ప్రేమకథ ఆధారంగా ``కరాచీ టు నోయిడా`` టైటిల్‌తో ఓ సినిమా రాబోతోంది. ఆ సినిమాలో నిజ జీవిత పాత్ర పోషించాల్సిందిగా సీమాను నిర్మాత అడిగారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల సీమా ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. ఈ సినిమాలో నటిస్తే చంపేస్తామని ఆమెకు బెదిరింపులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. పబ్‌జీ గేమ్‌లో పరిచయమైన సచిన్ కోసం సీమా ఎంతో సాహసానికి ఒడిగట్టి బోర్డర్ దాటి వచ్చిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-09-04T18:54:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising