10 Most Popular Smartphones: ప్రపంచంలోనే అత్యంత పాపులర్ ఫోన్లు ఇవే.. టాప్ 10 లో తొలి 4 ఫోన్లు ఒక్క కంపెనీవే..!

ABN , First Publish Date - 2023-09-04T16:46:24+05:30 IST

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ లేకుండా రోజు గడవడం కష్టంగా మారిపోయింది. కొంత మంది బడ్జెట్ ఫోన్లను వాడుతుంటారు. మరికొందరు ప్రీమియం ఫోన్లను వాడుతుంటారు. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎన్నో కంపెనీలకు చెందిన మొబైల్స్ ఉన్నాయి. అయితే ఈ ప్రపంచంలోనే అత్యంత పాపులర్ ఫోన్లు ఏవో తెలుసా?

10 Most Popular Smartphones: ప్రపంచంలోనే అత్యంత పాపులర్ ఫోన్లు ఇవే.. టాప్ 10 లో తొలి 4 ఫోన్లు ఒక్క కంపెనీవే..!

ప్రస్తుతం మొబైల్ ఫోన్ (Mobile) అనేది మన దైనందిన జీవితంలో ఓ ముఖ్యమైన భాగం అయిపోయింది. స్మార్ట్‌ఫోన్ (Smart Phone) లేకుండా రోజు గడవడం కష్టంగా మారిపోయింది. కొంత మంది బడ్జెట్ ఫోన్లను వాడుతుంటారు. మరికొందరు ప్రీమియం ఫోన్లను వాడుతుంటారు. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎన్నో కంపెనీలకు చెందిన మొబైల్స్ ఉన్నాయి. అయితే ఈ ప్రపంచంలోనే అత్యంత పాపులర్ ఫోన్లు (Most Popular Smartphones) ఏవో తెలుసా? తాజాగా ఓమ్‌డియా అనే కంపెనీ సర్వే చేసి ఈ ఏడాదిలో ప్రపంచంలోనే పది పాపులర్ ఫోన్ మోడళ్లు ఏవో తెలుసుకుంది.

ఆ సంస్థ సర్వే ప్రకారం.. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max) ఈ ఏడాది అతి ఎక్కువ మందిని ఆకట్టుకుంది. ఆపిల్ (Apple) సంస్థ ఈ ఏడాది తొలి అర్థభాగంలో ఏకంగా 2.65 కోట్ల 14 ప్రో మ్యాక్స్ ఫోన్లను విక్రయించింది. 14 ప్రో మ్యాక్స్ తర్వాత అదే సంస్థకు చెందిన 14 ప్రో టాప్-2 ప్లేస్ దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఆపిల్‌కే చెందిన 14, 13 ఫోన్లు ఉన్నాయి. ఇక, శామ్‌సంగ్ (Samsung Smart Phones) గెలాక్సీ ఏ-14 ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది దాదాపు 1.2 కోట్ల ఏ-14 మోడల్ మొబైల్స్‌ను శామ్‌సంగ్ విక్రయించింది. ఆ తర్వాతి స్థానంలో శామ్‌సంగ్‌కే చెందిన ఎస్23 అల్ట్రా నిలిచింది.

SIM Cards New Rule: అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి కొత్త రూల్.. ఇకపై సిమ్ కార్డు పోయినా, పాడైపోయినా..!

ఇక, ఈ ఏడాది అత్యంత ఆదరణ పొందిన మొబైల్ మోడల్స్ జాబితాలో వరుసగా 7, 8, 9, స్థానాల్లో శామ్‌సంగ్‌కే చెందిన ఏ-14 5జీ, ఏ54 5జీ, ఏ-34 5జీ మొబైళ్లు నిలిచాయి. ఆ తర్వాత ఆపిల్‌కు చెందిన ఐఫోన్ 11 పదో స్థానంలో నిలిచింది. ఆసియా, యూరోప్, ఐరోపాల్లో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం టాప్-10 జాబితాలో కేవలం ఐఫోన్, శామ్‌సంగ్ కంపెనీలకు చెందిన మొబైల్స్‌నే ఎక్కువ మంది వాడుతున్నారు.

Updated Date - 2023-09-04T16:46:24+05:30 IST