ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

K Viswanath: విశ్వనాథ్ కన్నుమూతపై చిరంజీవి భావోద్వేగం.. ఒక్క ట్వీట్‌తో అనుబంధం వెల్లడి..

ABN, First Publish Date - 2023-02-03T09:27:49+05:30

దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్ (K Viswanath Passed away) కన్నుమూతపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భావోద్వేగంగా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్ (K Viswanath Passed away) కన్నుమూతపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భావోద్వేగంగా స్పందించారు. ట్విటర్ వేదికగా స్పందించారు. వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురుశిష్యుల సంబంధమని, అంతకుమించి తండ్రీ కొడుకుల అనుబంధమంటూ ఒక్క మాట ద్వారా ఇద్దరి అనుబంధాన్ని వెల్లడించారు. ఆయన దర్శకత్వంలో ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’, ‘ఆపద్భాంధవుడు’ అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం దక్కిందని గుర్తుచేసుకున్నారు.

కే.విశ్వనాథ్‌పై చిరంజీవి ట్వీట్ యథాతథంగా...

‘‘ ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు కళాతపస్వి కే.విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్‌ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగుజాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసికెళ్లిన మహా దర్శకుడు ఆయన.

ఆయన దర్శకత్వంలో ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’, ‘ఆపద్భాంధవుడు’ అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురుశిష్యుల సంబంధం. అంతకుమించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిచిన సమయం నాకు అత్యంత విలువైనది. ప్రతి నటుడికీ ఆయనతో పని చేయటం ఒక ఎడ్యుకేషన్ లాంటిది. ఆయన చిత్రాలు భావిదర్శకులకి ఒక గైడ్ లాంటివి. 43 సంవత్సరాల క్రితం ఆ మహానీయుడి ఐకానిక్ చిత్ర ‘శంకరాభరణం’ విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు.

ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవి. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకి, తెలుగువారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-02-03T10:25:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising