ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రోడ్డు పక్కన ప్రాణాపాయంలో ఒంటె.. ఒక్క బాటిల్‌తో దాన్ని ఎలా కాపాడాడో చూడండి..

ABN, First Publish Date - 2023-06-20T20:16:17+05:30

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. మనుషుల మాదిరిగానే జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. విపరీతమైన వేడి నుంచి రక్షించుకోవడానికి మానవులకు ఇతర మార్గాలు ఉన్నాయి. కానీ, జంతువులకు ఆ సౌలభ్యం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు (Heat waves) మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. మనుషుల మాదిరిగానే జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. విపరీతమైన వేడి నుంచి రక్షించుకోవడానికి మానవులకు ఇతర మార్గాలు ఉన్నాయి. చాలా జంతువులకు కనీసం తాగు నీరు (Water) కూడా దొరకడం లేదు. ముఖ్యంగా రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతంలో నీళ్లు దొరక్క ఒంటెలు ఎలా ఇబ్బంది పడుతున్నాయో ఓ వీడియో కళ్లకు కట్టినట్టు చూపించింది.

IFS అధికారి సుశాంత నంద ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఒంటె (Camel) ఎడారిలో రోడ్డు పక్కన నిస్సత్తువుగా పడి ఉంది. ఆ సమయంలో ఎండ తీవ్ర స్థాయిలో ఉంది. ఆ ఒంటె పైకి లేవడానికి కూడా ఓపిక లేని స్థితిలో ఉంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ డ్రైవర్ ఆ ఒంటె పరిస్థితిని గమనించాడు. వెంటనే తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్‌ (Water bottle)ను తీసుకుని దాని దగ్గరకు వెళ్లి నోటికి అందించాడు. తీవ్ర దాహంతో ఉన్న ఒంటె ఆ నీటిని గటగటా తాగేసింది. నీళ్లు తాగిన తర్వాత ఒంటె కాస్త శక్తి పుంజుకున్నట్టు కనపించింది.

Viral Video: కిక్ బాగా ఎక్కేసినట్టుంది.. ప్రాణాలను పణంగా పెట్టి ఎక్కడ వ్యాయామం చేస్తున్నాడో చూడండి..

``వేడి కారణంగా డీహైడ్రేషన్‌కు గురై ఆ ఒంటె ప్రాణాలు పోగొట్టుకునే స్థితిలో పడింది. దయగల డ్రైవర్ దానికి నీళ్లు అందించి ప్రాణాలు కాపాడాడు. మనం అధిక ఉష్ణ తాపాన్ని ఎదుర్కొంటున్నాం. మీరు ఇచ్చే కొన్ని చుక్కల నీళ్లు జంతువుల ప్రాణాలు కాపాడతాయి. మీ తోటి జీవుల పట్ల దయ చూపండి`` అని సుశాంత నంద పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-06-20T20:16:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising