Viral Video: కిక్ బాగా ఎక్కేసినట్టుంది.. ప్రాణాలను పణంగా పెట్టి ఎక్కడ వ్యాయామం చేస్తున్నాడో చూడండి..

ABN , First Publish Date - 2023-06-20T19:58:53+05:30 IST

మద్యం మత్తు బాగా తలకెక్కితే ఏం చేస్తున్నామనే స్పృహ మందు బాబులకు ఉండదు. కిక్ బాగా తలకెక్కితే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాహసాలకు దిగుతారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: కిక్ బాగా ఎక్కేసినట్టుంది.. ప్రాణాలను పణంగా పెట్టి ఎక్కడ వ్యాయామం చేస్తున్నాడో చూడండి..

మద్యం (Alcohol) మత్తు బాగా తలకెక్కితే ఏం చేస్తున్నామనే స్పృహ మందు బాబులకు ఉండదు. కిక్ బాగా తలకెక్కితే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాహసాలకు దిగుతారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియోలో ఓ యువకుడు హై-వే (Highway) మీద ఏర్పాటు చేసిన సైన్ బోర్డు (Signboard) పైకి ఎక్కి వ్యాయామం చేయడం ప్రారంభించాడు. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

sambalpuri_mahani. అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఒడిశాలోని పట్‌నాఘర్‌ సమీపంలోని హై-వేపై ఉన్న ఎత్తైన సైన్ బోర్డుపైకి ఓ యువకుడు ఎక్కి పుష్-అప్స్ (Push-ups) చేశాడు. అనంతరం ఆ సైన్ బోర్డుకు వేలాడాడు. కింద రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణికులు ఆ యువకుడిని ఆశ్చర్యంగా చూశారు. ఆ వ్యక్తి చేష్టలను ఎవరో వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ``దేశీయ మద్యాన్ని ఎక్కువగా వినియోగించినపుడు ఇలాగే ఉంటుంది`` అని కామెంట్ చేశారు.

Parents: పెళ్లయిన 13 ఏళ్లకు పుట్టిన కూతురు.. గారాబంగా పెంచిన తల్లిదండ్రులనే చంపేందుకు ఆ యువతి స్కెచ్.. అసలు కారణం తెలిసి..!

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 59 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఎంత డోస్ తీసుకున్నావు బ్రదర్``, ``మద్యం సేవించిన తర్వాత నేను 5 పుష్-అప్స్ కూడా చేయలేకపోయాను``, ``పాపం.. అతనికి తానెక్కడ ఉన్నాడో కూడా తెలియడం లేదు`` అని కామెంట్లు చేశారు.

Updated Date - 2023-06-20T19:58:53+05:30 IST