Parents: పెళ్లయిన 13 ఏళ్లకు పుట్టిన కూతురు.. గారాబంగా పెంచిన తల్లిదండ్రులనే చంపేందుకు ఆ యువతి స్కెచ్.. అసలు కారణం తెలిసి..!

ABN , First Publish Date - 2023-06-20T19:43:13+05:30 IST

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యుగం నడుస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎంతో మంది స్మార్ట్‌ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలైతే మొబైల్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ 13 ఏళ్ల బాలిక మొబైల్ లాక్కున్న తల్లిదండ్రులపై పగ పెంచుకుంది.

Parents: పెళ్లయిన 13 ఏళ్లకు పుట్టిన కూతురు.. గారాబంగా పెంచిన తల్లిదండ్రులనే చంపేందుకు ఆ యువతి స్కెచ్.. అసలు కారణం తెలిసి..!

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ (Smart Phone) యుగం నడుస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎంతో మంది స్మార్ట్‌ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలైతే మొబైల్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ 13 ఏళ్ల బాలిక.. మొబైల్ లాక్కున్న తల్లిదండ్రులపై పగ పెంచుకుంది. వారిద్దరినీ చంపెయ్యాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఆ బాలిక వేసిన స్కెచ్ గురించి తెలిసి పోలీసులే నివ్వెరపోయారు. సహజ మరణాలుగా కనిపించేందుకు ఆ 13 ఏళ్ల బాలిక అద్భుతమైన స్కెచ్ వేసింది.

ఈ కుట్ర అనుకోకుండా బయటపడడంతో భయపడిపోయిన తల్లిదండ్రులు గుజరాత్ పోలీసు హెల్ప్‌లైన్ అభయంకు ఫోన్ చేసి సహాయం కోరారు. అభయం సిబ్బంది ఆ బాలికను తమతో పాటు తీసుకెళ్లి కౌన్సిలింగ్ నిర్వహించారు. మొబైల్ చూస్తుండగా లాక్కున్నారనే కోపంతో తల్లిదండ్రులను చంపాలని నిర్ణయించుకున్నట్టు ఆ బాలిక సిబ్బంది ఎదుట అంగీకరించింది. తల్లిదండ్రులవి సహజ మరణాలుగా కనిపించేందుకు ఆ బాలిక పంచదార డబ్బాలో పురుగుల మందు కలిపింది. అలాగే బాత్రూమ్‌లో ఫ్లోర్‌పై ఫినైల్ వేసేది (Crime News).

Husband: రక్షించండి మహాప్రభో.. నా భార్య నన్ను రోజూ కొడుతోంది.. పోలీసులకు ఫోన్ చేసి చెప్పుకున్నాడో భర్త.. చివరకు..!

బాత్రూమ్‌లో కాలు జారి తల నేలకు ఢీకొట్టి చనిపోతే సహజ మరణంగా భావిస్తారని 13 ఏళ్ల బాలిక ప్లాన్ వేసింది. అంత చిన్న వయసులోనే అంత క్రూరంగా ఆలోచించిన తీరుకు అందరూ నివ్వెరపోతున్నారు. ఆ దంపతులకు పెళ్లయిన 13 ఏళ్ల తర్వాత పుట్టిన బాలిక కావడంతో వారు అల్లారు ముద్దుగా పెంచారు. దీంతో ఆమె నిరంతరం మొబైల్‌ (Mobile Addict)తోనే గడిపేది. ఎప్పుడూ మొబైల్ ద్వారా ఆన్‌లైన్ ఛాటింగ్, రీల్స్ చూస్తూ గడిపేది. మొబైల్ లాక్కున్నారనే కోపంత ఏకంగా తల్లిదండ్రులనే చంపాలని నిర్ణయించుకుంది.

Updated Date - 2023-06-20T19:43:13+05:30 IST